#SankranthiSpecial: సంక్రాంతికి కర కర సకినాలు.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే రుచి అదిరిపోతుంది
ఈ వార్తాకథనం ఏంటి
సకినాలు తయారీకి కావాల్సిన పదార్థాలు బియ్యం - 1 కిలో నువ్వులు - 4 టేబుల్ స్పూన్లు వాము - 2 టేబుల్ స్పూన్లు ఉప్పు - రుచికి సరిపడ నూనె - వేయించడానికి సరిపడగా
Details
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని మూడు గంటల పాటు నానబెట్టాలి. మధ్యలో ఒకసారి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, పాత నీటిని పారబోసి కొత్త నీళ్లు పోసి మళ్లీ నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల బియ్యం వాసన రాకుండా ఉంటాయి. నానిన బియ్యాన్ని నీటిలో నుంచి తీసి, శుభ్రమైన గుడ్డలో వడకట్టి ఆరబెట్టాలి. ఫ్యాన్ ముందు లేదా ఎండలో ఎండబెట్టకూడదు. బియ్యంలో ఉన్న నీరు పూర్తిగా పోయిన తర్వాత మిక్సీలో వేసి చాలా మెత్తగా పిండిగా రుబ్బుకోవాలి. పిండి ఎంత మెత్తగా ఉంటే, సకినాలు అంత సన్నగా, కరకరమనేలా వస్తాయి. తర్వాత ఒక పెద్ద గిన్నెలో ఈ బియ్యం పిండిని వేసి, అందులో నువ్వులు, వాము, రుచికి సరిపడ ఉప్పు కలపాలి.
Details
తయారీ విధానం 1/2
కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీరు పోస్తే పిండి ఎండిపోయి సకినాలు సరిగా రావు. సిద్ధమైన పిండిని గుడ్డ పరచిన నేలపై లేదా బోర్డుపై చేతులతో సకినాల ఆకారంలో జాగ్రత్తగా వత్తాలి. గుండ్రంగా, ఎక్కడా విరగకుండా సమంగా చేయాలి. అనంతరం గ్యాస్ స్టవ్‌పై పెద్ద కడాయి పెట్టి, అందులో వేయించడానికి సరిపడ నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత సిద్ధం చేసిన సకినాలను వేసి, మెల్లగా తిప్పుతూ బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అంతే... వేడి వేడి కరకరలాడే సకినాలు సిద్ధం. చల్లారిన తర్వాత ఏదైనా గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే నెల రోజుల వరకు బాగానే ఉంటాయి.
Details
జాగ్రత్తలు
నువ్వులు, వాము ఆరోగ్యానికి మంచివని కొందరు ఎక్కువ మోతాదులో కలుపుతుంటారు. అయితే అలా చేస్తే సకినాల ఆకారం సరిగా రాకపోవడంతో పాటు, వేయించే సమయంలో విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే చెప్పిన కొలతల ప్రకారమే నువ్వులు, వాము పిండిలో కలపడం ఉత్తమం.