
Sodas In Summer: వేసవిలో ఎక్కువగా సోడాలను తాగితే వచ్చే సమస్యలు ఇవే !
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి కాలంలో దాహాన్ని తీర్చుకునేందుకు చాలా మంది సోడాలను అధికంగా తాగుతుంటారు. అయితే వీటిని ఎక్కువగా తాగితే కొన్నిఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు.
1. ఎముకల బలహీనత: సోడాలను అధికంగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి.దీని ఫలితంగా ఎముకల సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. 2. రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదల: సోడా వంటి అధిక చక్కెర కలిగిన పానీయాలను తరచుగా తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రతిస్పందన మారిపోతుంది.దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి,డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది.
3. కాలేయంపై ప్రతికూల ప్రభావం ప్రతిరోజూ సోడా తాగడం కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దీని వల్ల కాలేయానికి ఒత్తిడి పెరిగి,దీర్ఘకాలిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.కాబట్టి వీటిని పరిమితంగా తీసుకోవడం ఉత్తమం.
వివరాలు
తలనొప్పి, మైగ్రైన్ సమస్యలు
4. నిద్రలేమి సమస్య: సోడాలలో కెఫిన్ అధికంగా ఉంటుంది. దీని ఎక్కువగా తీసుకుంటే నిద్రలేమి సమస్య తలెత్తొచ్చు. ముఖ్యంగా సాయంత్రం లేదా రాత్రి వేళల్లో సోడా తాగితే ప్రశాంతమైన నిద్రకు భంగం కలుగుతుంది.
5. తలనొప్పి, మైగ్రైన్ సమస్య: సోడాలను అధికంగా తాగితే కొన్నిసార్లు తీవ్రమైన తలనొప్పి, మైగ్రైన్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
6. అధిక క్యాలరీలు, పోషక విలువల లేమి: సోడాల్లో అధికంగా చక్కెర,ఫ్రక్టోజ్ సిరప్ ఉంటుంది. ఇవి శరీరానికి ఎలాంటి పోషక విలువలు అందించవు. కేవలం అధిక క్యాలరీలను మాత్రమే చేరవేస్తాయి. దీని వల్ల శక్తి వినియోగం, వ్యయం అసమతుల్యంగా మారి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
వివరాలు
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా కీరదోస కంజి
కీరదోస కంజి అనేది కీరదోస, నీరు, సుగంధ ద్రవ్యాలతో తయారైన పులియబెట్టిన వేసవి పానీయం. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
ఈ ప్రోబయోటిక్-రిచ్ జ్యూస్:
పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
బరువు తగ్గటానికి సహాయపడుతుంది
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
మెరిసే చర్మం, ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహిస్తుంది
కాబట్టి, వేసవిలో సోడాలకు బదులుగా ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకోవడం ఉత్తమం!