గుండెకు ఆరోగ్యాన్ని అందించడం నుండి జీర్ణశక్తిని పెంచడం వరకు ఎడమ వైపు పడుకుంటే కలిగే ప్రయోజనాలు
పడుకునే పొజిషన్ సరిగ్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుందని మీకు తెలుసా? ఎడమ వైపు పడుకుంటే ఆరోగ్యానికి మంచిదని మీరు వినే ఉంటారు. అయితే అసలు ఎలా మంచిదో మనం ఇక్కడ తెలుసుకుందాం. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది: సాధారణంగా పెద్ద పేగు ప్రారంభం భాగం శరీరంలో కుడివైపు ఉంటుంది. ఆహారం జీర్ణమయ్యాక మిగిలిన వ్యర్థాలన్నీ పెద్ద పేగులోకి వెళ్ళిపోతాయి. ఎడమ వైపు పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ కారణంగా మలినాలన్నీ ఈజీగా పెద్ద పేగులోకి వెళతాయి. కాలేయం మీద భారాన్ని తగ్గిస్తుంది: కాలేయం కుడివైపు ఉంటుంది. మీరు కుడివైపు పడుకున్నప్పుడు కాలేయం మీద ఒత్తిడి పడుతుంది. ఎడమ వైపు పడుకుంటే ఆ ఇబ్బంది ఉండదు.
గుండెపై భారాన్ని తగ్గించేందుకు ఎడమవైపు పడుకోవాలి
ప్లీహం పనితీరును మెరుగుపరిస్తుంది: శరీరంలో ప్లీహం ఎడమ వైపున ఉంటుంది. ఎడమ వైపు పడుకోవడం వల్ల వ్యర్థపదార్థాలన్నీ ప్లీహములోకి ఈజీగా వెళ్ళిపోతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది: గుండె ఎడమ వైపున ఉంటుంది. మీరు కుడివైపు పడుకుంటే శరీరాన్ని రక్తాన్ని సరఫరా చేయాలంటే గుండెపై అదనపు భారం పడుతుంది. అదే ఎడమ వైపు పడుకుంటే సాఫీగా రక్తాన్ని శరీర భాగాలకు పంపిస్తుంది. గర్భిణీ స్త్రీలు ఎడమ వైపు పడుకుంటే మంచిది: కడుపులో ఉన్న బిడ్డ పోషకాలు సరిగ్గా అందాలన్నా, వీపు, వెన్నెముకపై భారం పడకుండా ఉండాలన్నా గర్భిణీ స్త్రీలు ఎడమ వైపు పడుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.