
వర్షకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే
ఈ వార్తాకథనం ఏంటి
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబిలే అవకాశం ఉంది. అయితే వర్షాకాలంలో కొద్దిపాటి జాగ్రత్తలను పాటిస్తే జబ్బులు దూరమవుతాయి. ఈ కాలంలో రోగనిరోధక శక్తి, జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని ఆహారపు అలవాట్ల గురించి మనం తెలుసుకోవాలి.
వానాకాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తితే రోగనిరోధక శక్తి తగ్గి, ఆరోగ్యం క్షీణిస్తుంది.
అనారోగ్యాన్ని అధిగమించాలంటే వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం..
నీరు ఎక్కువగా తాగాలి
వానాకాలంలో శరీరానికి హైడ్రేషన్ అవసరం. మామూలుగానే ఈ కాలంలో దాహం తక్కువగా తాగాలని అనిపిస్తుంది. అయితే వర్షాకాలంలో నీరు ఎక్కువగా తీసుకోవాలి. వర్షపు వాతావరణం కొన్నిసార్లు అధిక తేమకు కారణమవుతుంది. ఇది చెమట, ద్రవం నష్టానికి కారణమవుతుంది. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి.
Details
గ్రీన్ టీ వల్ల రోగ నిరోధక శక్తి మెండు
వెచ్చని పానీయాలను తీసుకోవాలి
వర్షాకాలంలో హెర్బల్ టీలు, సూప్‌లు అల్లం కలిపిన పానీయాలు వంటి వెచ్చని పానీయాలను ఎంచుకోవాలి. దీంతో శరీరం వెచ్చగా, హాయిగా ఉండటంతో పాటు అదనపు ఆరోగ్య ప్రయోజనాలు కూడా సమకూరుతాయి.
చమోమిలే, గ్రీన్ టీ వంటి హెర్బ్ టీల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
సీజనల్ పండ్లతో రోగనిరోధక శక్తి మెండు
వర్షాకాలంలో లభించే సీజనల్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. యాపిల్, బేరి, దానిమ్మ, నారింజలో విటమన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండ్లు అంటువ్యాధులను దూరం చేసే అవకాశం ఉంది.
Details
స్ట్రీట్ ఫుడ్ వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం
స్ట్రీట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి
వర్షాకాలంలో స్ట్రీట్ ఫుట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఆ ప్రాంతంలో బ్యాక్టీరియా, శిలీంధ్రాల పెరుగుదలకు అనుకూలమైన పరిస్థితులను సృష్టించగలదు. స్ట్రీట్ ఫుడ్ వల్ల వ్యాధులు ప్రబిలే అవకాశ ముంది.
ఆహారాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేసుకోవాలి
ఆహరాల పదార్థాలను సరైన పద్ధతిలో నిల్వ చేసుకోవాలి. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఆహార పదార్థాలను సరిగ్గా నిల్వ చేయకపోతే త్వరగా పాడవుతాయి.
పండ్లు, కూరగాయాలను రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయడానికి గాలి చొరబడిని కంటైనర్ లను ఉపయోగించాలి.
Details
విటమిన్ సి తో తెల్ల రక్తకణాల ఉత్పత్తి
విటిమన్ సి ఉండే ఆహారాలు తీసుకోవాలి
రోగ నిరోధక శక్తిని మెరుగుపర్చుకోవడానికి విటమిన్ సి ఆధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. నిమ్మకాయలు, నారింజలు, ద్రాక్షపండ్లు వంటి సిట్రస్ పండ్లు తీసుకోవడం మంచిదే. కివీస్, బెల్ పెప్పర్స్, బ్రోకలీలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ముఖ్యంగా విటమిన్ సి తో తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
లీన్ ప్రోటీన్లు వల్ల కండరాల పెరుగుదల
తృణధాన్యాలు, లీన్ ప్రోటిన్లు, కూరగాయల కలయికతో కూడిన సమతుల్య భోజనాన్ని ఎంచుకోవాలి. దీంతో బరువుగా, నీరసంగా అనిపించకుండా ఉంటుంది. బ్రైన్ రైస్, క్వినోవా, ఓట్స్ వంటి తృణధాన్యాలు ఫైబర్, స్థిరమైన శక్తిని పెంచుతాయి.
చికెన్, చేపలు, టోఫు వంటి లీన్ ప్రోటీన్లతో కండరాలు పెరిగే అవకాశం ఉంటుంది.