Phool Makhana: మఖానా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..?
ఈ వార్తాకథనం ఏంటి
ఫాక్స్ నట్స్ (మఖానా) పోషకాలతో సమృద్ధిగా ఉండటంతో, ఆరోగ్య ప్రియులు వీటిని ఎక్కువగా తింటున్నారు.
మఖానాను పాలలో లేదా పాలతో కలిపి నానబెట్టి తినడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.
ఇది శరీరానికి, ఎముకలకు బలాన్నిచ్చే సూపర్ ఫుడ్‌గా పరిగణించబడుతుంది.
ముఖ్యంగా, పాలతో కలిపి మఖానా తీసుకుంటే దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.
ఎవరెవరు మఖానా తినవచ్చు?
ఉపవాస సమయంలో ఉన్నవారు, షుగర్ వ్యాధి ఉన్నవారు, బరువు తగ్గాలని ఆశిస్తున్న మహిళలు చక్కెర లేకుండా పాలలో మఖానాను వేసుకుని తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
పూర్తి బెనిఫిట్స్ తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..
వివరాలు
పాలలో ఉండే పోషకాలు
పాలను సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. ఇందులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు (A, D, E), భాస్వరం, అయోడిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
ఇవన్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అదే విధంగా, మఖానా కూడా కాల్షియంకు అద్భుతమైన మూలం.
ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, జింక్, పొటాషియం,యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. కాబట్టి, పాలు, మఖానా కలిపి తీసుకుంటే శరీరానికి అవి రెట్టింపు ప్రయోజనాలను అందిస్తాయి.
వివరాలు
ఎముకల బలాన్ని పెంచే మిశ్రమం
తామర గింజలతో కలిపిన పాలను తాగితే ఎముకలు బలపడతాయి.
ఎముకల బలహీనత లేదా నొప్పితో బాధపడుతున్న వారు రోజూ దీనిని తీసుకోవడం మంచిది.
మఖానాలో తక్కువ క్యాలరీలు ఉండటంతో, దీన్ని తినడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఇది బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి మంచి ఎంపిక అవుతుంది.
వివరాలు
రక్తపోటు, జీర్ణక్రియ సమస్యల నివారణ
పాలలో మఖానాను మరిగించి క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అజీర్ణం, మలబద్ధకం సమస్య ఉన్నవారు వేడి పాలలో మఖానా వేసుకుని తాగితే ఉపశమనం పొందుతారు.
దీనివల్ల జీర్ణ సంబంధిత ఆమ్లత్వ సమస్యలు కూడా తగ్గుతాయి.
వివరాలు
డయాబెటిక్ పేషెంట్లకు మఖానా ప్రయోజనాలు
మఖానాకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని అదుపులో ఉంచుతుంది.
దీని వలన ఎక్కువ సమయం ఆకలి అనిపించదు. డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఆరోగ్యకరమైన స్నాక్.
మఖానాను పాలతో తీసుకుంటే గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇందులో ఉన్న పొటాషియం, మెగ్నీషియం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
శరీరానికి శక్తినిచ్చే మఖానా పాలు
రోజంతా శరీరాన్ని చురుగ్గా ఉంచడానికి, అల్పాహారంగా మఖానా పాలు తీసుకోవడం మంచిది.
పాలు, మఖానాలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి సమృద్ధమైన శక్తిని అందిస్తాయి. రాత్రిపూట పాలలో మఖానాను మరిగించి తాగితే ఒత్తిడి తగ్గి, నిద్ర మెరుగవుతుంది.