
ఆహారం: బరువు తగ్గడానికి, జీర్ణక్రియ మెరుగు కావడానికి చియా గింజలు చేసే మేలు
ఈ వార్తాకథనం ఏంటి
చియా గింజలను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. అందుకు కారణం దానిలోని పోషక విలువలే. నలుపు, తెలుపు రంగుల్లో ఉండే చియా గింజలు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను, ప్రోటీన్, ఫైబర్ ను కలిగి ఉంటాయి.
సాల్వియా హిస్పానికా అనే మొక్క నుండి చియా గింజలు వస్తాయి. నిజానికి ఈ మొక్క మెక్సికో దేశానికి చెందినది. ప్రపంచ దేశాల్లో అమెరికా, అస్ట్రేలియాలో కూడా కనిపిస్తుంది.
ప్రస్తుతం చియా గింజల వల్ల శరీరానికి కలిగే మేలు ఏంటో తెలుసుకుందాం.
బరువు తగ్గడం:
చియా గింజల్లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల చాలాసేపటి వరకు ఆకలి వేయదు. కడుపు నిండిగా ఉంటుంది. అందువల్ల ఆకలి తొందరగా వేయదు. తద్వారా బరువు తగ్గుతారు.
Details
ఎముకలు బలంగా కావడానికి ఉపయోగపడే చియా గింజలు
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
చియా గింజల్లోని ఫైబర్ కారణంగా పేగుల కదలికలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఆహారం జీర్ణం కావడంలో ఎలాంటి ఇబ్బంది కలగదు. అందుకే చియా గింజలను మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.
ఎముకల బలానికి:
చియా గింజల్లో కాల్షియం, మెగ్నిషియం, పాస్ఫరస్ వంటి పోషకాలు ఉండడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఒకరోజులో మన శరీరానికి కావాల్సిన 18%కాల్షియం చియాగింజల్లో దొరుకుతుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉండడం గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని దూరం చేయడంలో చియా గింజలు మేలు చేస్తాయి.
అయితే చియా గింజలను ఎంత మోతాదులో వాడాలనేది డాక్టర్లను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది.