Page Loader
రక్తహీనత సమస్యను దూరం చేసే ఆహారాలను ఇప్పుడే మీ డైట్ లో చేర్చుకోండి 
రక్తహీనతను తగ్గించే ఆహారాలు

రక్తహీనత సమస్యను దూరం చేసే ఆహారాలను ఇప్పుడే మీ డైట్ లో చేర్చుకోండి 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 27, 2023
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

రక్తంలో ఐరన్ తగ్గిపోతే రక్తహీనత ఏర్పడుతుంది. ఎర్ర రక్తకణాల్లోని హీమోగ్లోబిన్ ఐరన్ ఉంటుంది. హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ ను శరీర భాగాలకు చేరవేస్తుంది. ఐరన్ తగ్గిపోవడం వల్ల శరీర భాగాలకు ఆక్సిజన్ సరిగ్గా అందక అనేక సమస్యలు ఏర్పడతాయి. వాటిల్లో, ఎప్పుడూ మగతగా అనిపించడం, చర్మం పాలిపోయి సహజ రంగు కోల్పోవడం, పాదాలు, చేతుల్లో నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ప్రస్తుతం రక్తహీనత సమస్య దూరం కావాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో చూద్దాం. నువ్వులు: వీటిలో ఐరన్, జింక్, కాపర్, సెలీనియం, ఫోలేట్, విటమిన్ బి6, విటమిన్-ఈ ఉంటాయి. ఈ కారణంగా, రక్తంలో ఐరన్ లోపం తగ్గుతుంది.

Details

ఐరన్ అధికంగా ఉండే కిస్ మిస్ 

గుడ్లు: గుడ్డులో ప్రోటీన్ ఉంటుందని అందరికీ తెలుసు, ఐరన్ కూడా ఉంటుందని తక్కువ మందికి తెలుసు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డును తీసుకుంటే మంచిది. ఎండుద్రాక్ష: వీటిని కిస్ మిస్ అని కూడా అంటారు. వీటిల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. మీ డైలీ డైట్ లో కిస్ మిస్ లని ఆహారంగా చేర్చుకుంటే మంచిది. శొంఠి: శొంఠిలో ఐరన్ అధికంగా ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా శొంఠి కలుపుకుని తాగితే శరీరానికి కావాల్సినంత ఐరన్ లభిస్తుంది. పండ్లు, కూరగాయలు: దానిమ్మ, నారింజ, నిమ్మ, స్వీట్ పొటాటో, స్ట్రాబెర్రీ, పాలకూర, మొదలగు వాటిల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారు వీటిని ఆహారంలో తీసుకోవడం బాగుంటుంది.