మీకు ఆరోగ్య సమస్యలున్నాయని మీ చర్మంపై కలిగే మార్పుల ద్వారా ఎలా తెలుసుకోవచ్చో చూడండి
చర్మం అనేది బయటకు కనిపించే పొర మాత్రమే కాదు. శరీరాన్ని కప్పి ఉంచే చర్మం, శరీరంలో జరుగుతున్న సమస్యలను బయటకు చూపిస్తుంది. శరీరంలో ఆరోగ్య సమస్యలు ఉంటే చర్మం మీద కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఎలాంటి సమస్యలకు చర్మం మీద ఏ విధమైన మార్పులు వస్తాయో చూద్దాం. మొటిమలు: కేవలం టీనేజర్లలో మాత్రమే కాదు, యవ్వనంలో ఉన్నవారిలోనూ మొటిమల సమస్య ఉంటుంది. దీనికి ప్రధాన కారణం, చర్మం మీద జిడ్డు ఎక్కువగా ఏర్పడటం, చర్మ రంధ్రాలు మూసుకుపోవడం మొదలైనవి కావచ్చు. హార్మోన్లలో అసమతుల్యత, డైట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా మొటిమలు ఏర్పడతాయి.
టీనేజర్లలో ఎక్కువగా కనిపించే వెల్వెట్ ప్లేక్స్
వెల్వెట్ ప్లేక్స్: మెడ, చంకలు, గజ్జలు వంటి భాగాల్లో చర్మం మందంగా మారి నల్లగా కనిపిస్తుంటుంది. ఈ పరిస్థితి చిన్నపిల్లల్లోనూ, టీనేజ్ లో ఉన్నవారిలోనూ కనిపిస్తుంటుంది. ఒంట్లో డయాబెటిస్ ఉంటే చర్మం మీద ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాదు శరీరంలో ఏదైనా తీవ్రమైన ఇబ్బంది ఉన్నా ఇలాంటి లక్షణం చర్మం మీద కనిపిస్తుంది. మణికట్టు మీద దురద పెట్టే వాపులు: మణికట్టు, మడమల మీద ఎర్రగా లేదా పర్పుల్ రంగుల్లో వాపులు ఏర్పడతాయి. కొన్ని కొన్నిసార్లు నోరు, నడుము కింది భాగం, మెడ, కాళ్ళు, మర్మాంగాల ప్రాంతంలో ఏర్పడతాయి. దీనికి కారణం ఏంటనేది ఎవ్వరికీ తెలియదు, కానీ వైద్యుడిని సంప్రదిస్తే మంచిది.
అపాయం చేయని స్ట్రెచ్ మార్క్స్
ఎర్రగా, చికాకుగా, పొడిగా మారి దురద పెట్టే చర్మం: మీ చర్మం ఎర్రగా దురద పెట్టడం, చికాకు కలిగించడం, పొడిగా మారిపోవడం వంటి లక్షణాలను చూపిస్తే అది ఎగ్జిమా కావచ్చు. ఎగ్జిమా వచ్చిందంటే, మీరు బాగా ఒత్తిడి లోనవుతున్నారని అర్థం చేసుకోవాలి. లేదంటే అలర్జీలకు గురి చేసే విషయాలతో మీ బాడీ ఫ్రెండ్లీగా లేదని అర్థం. స్ట్రెచ్ మార్స్క్: సాగదీత గుర్తులు ఏర్పడితే పెద్ద ప్రమాదమేమీ లేదు. కాకపోతే మీరు ఎక్కువ బరువు పెరుగుతున్నారని అర్థం చేసుకోవాలి. గర్భిణీ మహిళల్లో స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తుంటాయి. బాడీ బిల్డింగ్ యాక్టివిటీస్ ఎక్కువగా చేసేవారిలో, ఒకేసారి ఎక్కువ ఎత్తుకు పెరిగిన వారిలోనూ ఈ గుర్తులు కనిపిస్తాయి.