Page Loader
చర్మ సంరక్షణ: ఎండవల్ల మీ చర్మం నల్లబడుతుందా? కలబందతో మెరిసే చర్మాన్ని పొందండిలా 
చర్మానికి మేలు చేసే కలబంద

చర్మ సంరక్షణ: ఎండవల్ల మీ చర్మం నల్లబడుతుందా? కలబందతో మెరిసే చర్మాన్ని పొందండిలా 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 02, 2023
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎండాకాలంలో చర్మం నల్లబడటం సహజం. ఎండకు తిరుగుతూ ఉంటే చర్మం దాని సహజత్వాన్ని కోల్పోతుంది. ఈ నేపథ్యంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. సాధారణంగా ఎండలో బయటకు వెళ్ళేటపుడు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలని చెబుతారు. చేతులు, ముఖం, మెడ భాగాలకు సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే మంచిది. అయితే ఎండలో తిరగడం వల్ల కోల్పోయిన చర్మకాంతిని తిరిగి పొందడానికి కలబంద సాయం చేస్తుంది. అదెలాగో ఇక్కడ చూద్దాం. కలబంద గుజ్జును, లావెండర్ ఆయిల్ ను గ్రైండర్ లో వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడా మిశ్రమాన్ని ఎక్కడైతే ఎండ ప్రభావం కారణంగా చర్మం నల్లగా మారిందో అక్కడ అప్లై చేయాలి. దీనివల్ల చర్మానికి కొత్త మెరుపు వస్తుంది.

Details

మెరిసే చర్మం కోసం కలబంద ఐస్

కలబందను ఐస్ లాగా మార్చి చర్మానికి ఉపయోగిస్తే ఎండవల్ల నల్లగా మారిన చర్మం, మెరిసేలా తయారవుతుంది. దీనికోసం కలబంద ఆకులను విరిచి అది ఎండిపోయే వరకు పక్కన పెట్టండి. కలబంద ఆకు నుండి పసుపురంగు ద్రవం బయటకు వచ్చేవరకు ఎండబెట్టి, ఆ తర్వాత గుజ్జును బయటకు తీసి, గ్రైండర్ లో వేయాలి. ఇప్పుడు ఆ ద్రవాన్ని ఐస్ తయారయ్యే కంటైనర్ లో పోయాలి. తెల్లారిన తర్వాత గడ్డకట్టిన కలబంద రసం మంచు ముక్కను బయటకు తీసి, చర్మం ఎక్కడైతే రంగు మారిపోయిందో అక్కడ మర్దన చేయండి. కలబంద కారణంగా చర్మం యవ్వనంగా మారుతుంది. చర్మానికి కావాల్సిన తేమను అందించి మృదువుగా ఉంచడంలో కలబంద హెల్ప్ చేస్తుంది.