ఆరోగ్యం: వేసవిలో పిల్లలను హైడ్రేట్ గా ఉంచాలంటే ఎలాంటి ఆహారాలను అందించాలో తెలుసుకోండి
వేసవిలో పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం, హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. వేసవిలో పిల్లలు ఏయే ఆహారాలు తినాలి? ఏయే ఆహారాలు పిల్లలను హైడ్రేట్ గా ఉంచుతాయో తెలుసుకోవాలి. ఈ విషయంలో అబాట్ న్యూట్రిషన్ బిజినెస్ డైరెక్టర్ డాక్టర్ గణేష్ కాధే కొన్ని సూచనలు ఇస్తున్నారు. అవేంటో చూద్దాం. పండ్లు: పుచ్చకాయ, నారింజ, అప్రికాట్స్ మొదలైన పండ్ల వల్ల పిల్లలు హైడ్రేట్ గా ఉంటారు. శరీరంలో నీటిశాతం తగ్గిపోకుండా ఉంటుంది. ఈ పండ్లల్లో నీటిశాతం ఎక్కువగా ఉండడమే కాకుండా విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను మీ పిల్లలను తినిపించాలనుకుంటే, వాటిని రకరకాల డిజైన్లలో ముక్కలు చేయాలి. దానివల్ల వాటిని తినాలని పిల్లలకు అనిపిస్తుంది.
పిల్లలు ఇష్టంగా తాగే ఫ్రూట్ లస్సీ
ఫ్రూట్ లస్సీ: రోజులో కావాల్సినన్ని నీళ్ళు మీ పిల్లలు తాగకపోతే, ఫ్రూట్ లస్సీ తాగించడం మంచిది. పెరుగు, ఫ్రూట్స్ మిక్స్ చేసి లస్సీ తయారు చేసి, వారికి ఇష్టమైన కలర్ లోని స్ట్రాతో తాగించాలి. వెజిటబుల్ సలాడ్: సలాడ్లలో ఫైబర్, ప్రోటీన్ ఉండే వెజిటబుల్స్ ఉంటే బాగుంటుంది. దోసకాయ, పుచ్చకాయ, టమాట మొదలగు రంగు రంగుల కూరగాయలను పిల్లలకు తినిపించాలి. స్పా వాటర్: మీ పిల్లల కోసం ఇంట్లోనే స్పా వాటర్ తయారు చేసుకోవచ్చు. కొన్ని స్ట్రాబెర్రీలను, దోసకాయలను ముక్కలుగా కోసి ఒక గ్లాసులో వేయాలి. స్పా వాటర్ వల్ల పిల్లలు హైడ్రేట్ గా ఉంటారు. స్పా వాటర్ లో బెర్రీస్ ని కూడా కలుపుకుంటే రుచిగా ఉంటుంది.