ఊపిరితిత్తుల్లో ఇబ్బంది కలిగించే ఐపీఎఫ్ వ్యాధి లక్షణాలు, కారణాలు, ట్రీట్మెంట్
ఈ వార్తాకథనం ఏంటి
50-70సంవత్సరాల మధ్య వయస్సు గల వారిని ఐపీఎఫ్ సమస్య ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఐపీఎఫ్ అంటే ఇండియోపతిక్ పల్మనరీ ఫిబ్రోసిస్ అన్నమాట.
ఊపిరితిత్తుల్లో మచ్చ కణజాలం(స్కార్ టిష్యూ) ఏర్పడటం వలన రక్త ప్రవాహంలోకి ఆక్సిజన్ చేరడం కష్టమవుతుంది. దీనివల్ల మనిషి చనిపోయే ప్రమాదం ఉంది.
ఈ వ్యాధి లక్షణాలు, కారణాలు, ట్రీట్మెంట్ తెలుసుకుందాం.
ఐపీఎఫ్ లక్షణాలు:
దీని లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో సమయంలో బయటకు వస్తాయి. కొందరిలో ఐపీఎఫ్ సోకగానే కనిపిస్తే, మరికొందరిలో దీని లక్షణాలు బయటపడటానికి నెలలు, సంవత్సరాలు పడుతుంది.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, పొడిదగ్గు, ఊరికే అలసిపోవడం, అమాంతం బరువు తగ్గడం, కండరాలు, కీళ్ళ నొప్పి, చేతి, కాలి వేళ్ల కొనలు గుండ్రంగా, విశాలంగా మారతాయి.
Details
ఐపీఎఫ్ రావడానికి కారణాలు, చికిత్స
సిలికా డస్ట్, ఆస్ బెస్టాస్ ఫైబర్స్, కోల్ డస్ట్ వంటి రసాయనాల తాకిడి ఎక్కువ రోజులు ఉండడం, రేడియేషన్ థెరపీ కారణంగా ఐపీఎఫ్ వచ్చే అవకాశం ఉంది.
అలాగే, డెర్మటోమయోసైటిస్, రుమాటాయిడ్ ఆర్థరైటిస్, న్యూమోనియా వంటి వ్యాధుల కారణంగా కూడా ఐపీఎఫ్ సంభవించవచ్చు. కొన్నిసార్లు జెనెటిక్ సమస్యలు, పొగతాగడం వల్ల కూడా కలుగుతుంది. మహిళల్లో కంటే పురుషులకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది.
ట్రీట్మెంట్:
దీనికి సరైన చికిత్స లేదు. కాకపోతే మందుల వల్ల ఐపీఎఫ్ వల్ల వచ్చే లక్షణాలను తగ్గించవచ్చు. ఊపిరితిత్తుల్లో మచ్చ కణజాలం ఏర్పడటాన్ని పిర్ఫెనిడోన్, నైంటెడానిబ్ మందులు తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
ఆక్సిజన్ థెరపీ, కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాల ద్వారా ఐపీఎఫ్ లక్షణాలను తగ్గించవచ్చు.