కిచెన్: కరకలాడే ఆరోగ్యకరమైన చిప్స్, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండిలా
సాయంత్రం అవగానే ఏదో ఒక చిరుతిండి కోసం వెదకడం కొందరికి అలవాటు. ఆ సమయంలో కరకరలాడే చిప్స్ కనిపిస్తే వాళ్ళ కాళ్ళు అటువైపే లాగుతుంటాయి. కానీ మార్కెట్ లో దొరికే చిప్స్ దాదాపుగా ప్రాసెస్ చేసినవే ఉంటాయి. రిఫైన్డ్ ఆయిల్స్ లో వేయించి, రుచికోసం రసాయనాలు కలుపుతారు. వాటిని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మీకు చిరుతిళ్ళు ఇష్టమైతే, చిప్స్ అంటే నోరూరితే ఆరోగ్యకరమైన పదార్థాలతో ఇంట్లోనే తయారు చేసుకోగలిగే చిప్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇంట్లో తయారు చేసే చిప్స్ ని రిఫైన్డ్ ఆయిల్స్ లో వేయించకూడదు. బేక్ చేస్తే సరిపోతుంది. అలాగే ఆర్టీఫిషియల్ కలర్స్ ఇందులో అస్సలు వాడకూడదు. ఇంకెందుకు అలస్యం ఈ రెసిపీలను ఒక్కసారి ప్రయత్నించి చూడండి.
ఆరోగ్యకరమైన ఆహారాలతో తయారయ్యే చిప్స్
బంగాళదుంప చిప్స్: బంగాళదుంపలను గుండ్రంగా సన్నగా ముక్కలుగా కోసి, వాటిమీద ఆలివ్ ఆయిల్ వేసి మిరియాల పొడి, ఉప్పు, కారాన్ని జల్లుకుంటే సరిపోతుంది. పాలకూర చిప్స్: పాలకూర ఆకులను కడిగి వాటిని ముక్కలుగా కోసి ఆలివ్ ఆయిల్, వెనిగర్ ని ఆకులకు కలిపి బేకింగ్ షీట్ మీద వేసి 15నిమిషాల వరకు బేక్ చేయాలి. అ తర్వాత ఉప్పు జల్లుకుని తింటే బాగుంటుంది. పెసరపప్పు స్నాక్స్: పెసరపప్పు, ఉప్మారవ్వ, గోధుమ పిండి తీసుకుని కొన్ని నీళ్ళు పోసి బాగా కలపాలి. అ మిశ్రమానికి ఉప్పు, మిరియాలు, కారం పొడి కలుపుకుని బాగా కలిపి ఆ తడిపిండితో చిన్న బాల్స్ తయారు చేసుకుని ఆ బాల్స్ ని గుండ్రంగా ముక్కలుగా కోసి బేక్ చేయాలి.