క్రేటమ్ గురించి విన్నారా? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
క్రేటమ్ మొక్క గురించి మీకు తెలుసా? బహుశా తెలిసి వుండదు. ఈ మొక్క ఎక్కువగా ఆగ్యేయాసియా దేశాలైన థాయ్ లాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాల్లో దొరుకుతుంది.
ఈ మొక్క ఆకులను ఎండబెట్టి దాంతో టీ తయారు చేసుకుంటారు. అలాగే వాటి పొడితో ట్యాబ్లెట్లు తయారవుతాయి. ప్రస్తుతం ఈ మొక్కవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
నొప్పిని తగ్గిస్తుంది:
దీర్ఘకాల నొప్పులను తగ్గించడంలో క్రేటమ్ మొక్క చాలా ఉపయోగపడుతుంది. వర్కౌట్స్ చేసిన తర్వాత వచ్చే కండరాల నొప్పులను ఈ మొక్క తగ్గిస్తుందని చాలా పరిశోధనల్లో తెలిసింది.
శక్తినిస్తుంది:
రక్తప్రసరణను మెరుగుపర్చి శక్తిని అందించడంలో క్రేటమ్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆహారాన్ని తొందరగా జీర్ణం చేసి శరీరానికి శక్తినిస్తుంది.
ఆరోగ్యం
ఉదయాన్నే శక్తి కోసం క్రేటమ్ కాఫీ
శక్తిని అందించడంలో క్రేటమ్ ప్రాముఖ్యత ఎక్కువ కాబట్టి, చాలామంది ఉదయం పూట కాఫీలో క్రేటమ్ మొక్క సప్లిమెంట్లను వాడతారు.
మూడ్ ని బాగు చేస్తుంది:
కొన్ని అధ్యయనాల ప్రకారం క్రేటమ్ మొక్క వల్ల ఒత్తిడి తగ్గినట్లుగా తెలిసింది. దీని కారణంగా నరాలు చల్లబడి ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. ఐతే ఇక్కడో చిక్కుంది. క్రేటమ్ ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే, పానిక్ అటాక్స్, యాంగ్జాయిటీ, డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంది.
శృంగార కోరికలను పెంచుతుంది:
శృంగార సామర్థ్యాన్ని పెంచడానికి క్రేటమ్ వాడిన 99%మందిలో సత్ఫలితాలు వచ్చాయని సమాచారం. భావప్రాప్తిని ఆలస్యం చేసి శృంగార కోరికలను పెంచుతుంది.
చురుకుదనాన్ని పెంచుతుంది:
మెదడు పనితీరును వేగవంతం చేయడంలో సాయపడుతుంది క్రేటమ్ మొక్క. దీనివల్ల చురుకుదనం పెరుగుతుంది.