Loading...
Heath tips : ఆరోగ్యానికి అమృతం లాంటి అవకాడో.. రోజూ తింటే కలిగే లాభాలివే
ఆరోగ్యానికి అమృతం లాంటి అవకాడో.. రోజూ తింటే కలిగే లాభాలివే

Heath tips : ఆరోగ్యానికి అమృతం లాంటి అవకాడో.. రోజూ తింటే కలిగే లాభాలివే

వ్రాసిన వారు Moogati Shabari
Apr 07, 2026
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాలు కలిగిన సమతుల ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అందుకే చాలా మంది రోజువారీగా పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటారు. ఆ పండ్లలో అవకాడోకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా మంది దీనిని అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటారు. కానీ ప్రతిరోజూ అవకాడో తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు

గుండె ఆరోగ్యానికి మేలు

సాధారణంగా ఇతర పండ్లతో పోలిస్తే, అవకాడోలో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.

ముఖ్యంగా మోనోఅన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి.

ఇవి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

అదనంగా, ఇందులో ఫైబర్, పొటాషియం, వివిధ విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవన్నీ కలిసి శరీరానికి సమగ్ర ఆరోగ్యాన్ని అందిస్తాయి.

వివరాలు

బరువు తగ్గాలనుకునేవారికి వరం

అవకాడోలో ఒలిక్ యాసిడ్ అనే మోనోఅన్‌సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది.

క్రమం తప్పకుండా దీనిని తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

అలాగే ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

బరువు తగ్గాలని భావించే వారు అవకాడోను తమ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు.

ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల త్వరగా తృప్తి కలిగిస్తుంది.

దీని వల్ల ఎక్కువగా తినాలనే కోరిక తగ్గుతుంది. అలాగే ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండడం కూడా బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది.

ADVERTISEMENT

వివరాలు

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

అవకాడోలో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులు ఇతర ఆహారాల నుంచి వచ్చే విటమిన్ A, D, E, K వంటి కొవ్వులో కరిగే విటమిన్లను శరీరం సులభంగా గ్రహించేందుకు సహాయపడతాయి.

ఇందులో ఉండే పీచు పదార్థం పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఇది జీర్ణక్రియను సజావుగా కొనసాగించడంలో, మలబద్ధకాన్ని తగ్గించడంలో, మంచి బ్యాక్టీరియా పెరుగుదలలో సహాయపడుతుంది. దీంతో రోగనిరోధక శక్తి కూడా మెరుగవుతుంది.

దీర్ఘకాలిక వాపు ఆర్థరైటిస్, గుండె సమస్యలు, మధుమేహం వంటి వ్యాధులకు కారణమవుతుంది.

అవకాడోలో ఫైటోస్టెరాల్స్, కెరోటినాయిడ్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పదార్థాలు ఉంటాయి.

ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా దీనిని తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

ADVERTISEMENT

వివరాలు

రక్తాన్ని శుద్ధి చేస్తుందిలా..

ఇతర పండ్లతో పోలిస్తే అవకాడోలో చక్కెర పరిమాణం తక్కువగా ఉంటుంది.

ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారంతో పాటు తీసుకుంటే చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నివారించవచ్చు.

మధుమేహం లేదా ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారికి ఇది మంచి ఆహార ఎంపిక.

వివరాలు

చర్మం, జుట్టు, కంటి ఆరోగ్యానికి మేలు..

అవకాడోలో ల్యూటిన్, జియాక్సాంతిన్, విటమిన్ E వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇవి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడి, అకాల వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి. ఇందులోని కొవ్వులు చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచుతాయి.

దీనిని ఆహారంగా తీసుకోవడం లేదా చర్మంపై ఉపయోగించడం ద్వారా చర్మం అందంగా మారుతుంది.

విటమిన్ ఇ జుట్టు మెరుపును పెంచి, తల చర్మం పొడిబారకుండా చేస్తుంది.

అలాగే ల్యూటిన్, జియాక్సాంతిన్ కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

వివరాలు

క్యాన్సర్ల బారి నుంచి దూరం చేస్తుందిలా..

అవకాడోలో ఉన్న ఫైటోకెమికల్స్, కెరోటినాయిడ్స్ కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ముఖ్యంగా ప్రోస్టేట్, కోలన్ క్యాన్సర్‌లపై రక్షణాత్మక ప్రభావం చూపవచ్చు.

ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కణాల డీఎన్‌ఏను రక్షించడంలో సహాయపడతాయి.

అవకాడో క్యాన్సర్‌కు పూర్తి నివారణ కాకపోయినా, సమతుల ఆహారంలో భాగంగా తీసుకుంటే దీర్ఘకాలంలో రక్షణ కలిగించవచ్చు.

ADVERTISEMENT