Page Loader
జుట్టు రాలిపోయే సమస్యకు ఇంట్లో తయారు చేసుకునే షాంపూతో చెక్ పెట్టండి
జుట్టు రాలే సమస్యను అరికట్టే షాంపూలు

జుట్టు రాలిపోయే సమస్యకు ఇంట్లో తయారు చేసుకునే షాంపూతో చెక్ పెట్టండి

వ్రాసిన వారు Sriram Pranateja
Jan 06, 2023
11:32 am

ఈ వార్తాకథనం ఏంటి

కాలుష్యం పెరుగుతున్న కొద్దీ కాలంతో సంబంధం లేకుండా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. ప్రస్తుతం ఇదొక పెద్ద సమస్య. రసాయనాలు ఉండే షాంపూల వాడకం కూడా జుట్టు ఊడిపోవడానికి ఒక కారణంగా ఉంది. చుండ్రు, జుట్టును సరిగ్గా పట్టించుకోకపోవడం, జుట్టును ఎక్కువగా శుభ్రం చేయడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల జుట్టు ఊడిపోయే సమస్య వస్తుంది. దీన్ని నివారించడానికి ఇంట్లో తయారు చేసుకునే షాంపూలు ఉపయోగపడతాయి. వాటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. గుడ్డుపచ్చసొన, కలబంద: 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం లేదా కలబంద రసం తీసుకుని దానికి కొంత వంటనూనె కలుపుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల నీళ్ళు తీసుకుని గుడ్డు పచ్చసొనలో అన్నింటినీ మిక్స్ చేసి జుట్టుకు పెట్టుకోవాలి.

కేశ సంరక్షణ

ఇంట్లో తయారు చేసుకోగలిగే ఇతర షాంపూలు

పెరుగు, తేనె: ఒక పాత్ర తీసుకుని అందులో పెరుగు, తేనె వేసి బాగా కలపాలి. మంచి మిశ్రమం తయారు కాగానే తలకు పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. శనగపిండి: కొంచెం శనగపిండి, మెంతులపొడి, తీసుకుని తేనెలో బాగా కలపాలి. దీన్ని తలకు మర్దన చేసుకుని 10 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే మంచిది. శీకాకాయ: శీకాకాయలు, మెంతులను కలిపి నీళ్ళున్న పాత్రలో ఉడకబెట్టాలి. 15నిమిషాల తర్వాత వడపోయాలి. వడపోత వల్ల వచ్చిన ద్రావణాన్ని తలకు రుద్దుకోవాలి. ఉల్లిరసం, రోజ్ వాటర్: ఉల్లిగడ్డను తీసుకుని దాన్నుండి రసం పిండాలి. ఆ రసాన్ని రోజ్ వాటర్ లో బాగా కలిపి జుట్టుకు పట్టించాలి. 30నిమిషాల తర్వాత సాధారణ నీళ్ళతో జుట్టును కడుక్కోవాలి.