కొనదేలిన ముక్కు కోసం లక్షలు ఖర్చు పెట్టకుండా ఈ విధంగా ట్రై చేయండి
ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళు ఎక్కువ మందికి నచ్చకపోవచ్చు గానీ సూదిలాంటి కొనదేలిన ముక్కున్న వారు తమ అందంతో అందరినీ ఆకర్షిస్తారు. అందుకే సెలెబ్రిటీలు కొనదేలిన ముక్కు కోసం సర్జరీలకు లక్షలు ఖర్చు చేస్తారు. సర్జరీలకు కావాల్సినంత డబ్బు అందరి దగ్గరా ఉండదు, కానీ కొనదేలిన ముక్కు కావాలన్న కోరిక మాత్రం ఉంటుంది. అలాంటప్పుడు మీరు కొన్ని మేకప్ టెక్నిక్స్ తెలుసుకుంటే మంచిది. మేకప్ టెక్నిక్స్ ద్వారా మీ ముక్కుపై కత్తి పెట్టకుండా సూదిలాగా తయారు చేయవచ్చు. అదెలాగో చూద్దాం. ముక్కు బ్రిడ్జిని హైలైట్ చేయండి: మీ చర్మం రంగు కంటే తక్కువగా ఉండే హైలైట్నర్ తో ముక్కు బ్రిడ్జిని హైలైట్ చేయండి. పై నుండి కింద వరకు సన్నని గీత మాదిరిగా హైలైట్ చేయండి.
హైలైట్ అయ్యేలా మేకప్ వేయండి
ముక్కు కొనభాగానికి రంగు తగ్గించాలి: ముక్కు కొన భాగం చిన్నగా కనిపించాలంటే బ్రౌన్ కలర్ ఐషాడో షేడ్ సాయంతో కొనభాగం మీద అప్లై చేయాలి. బ్రో బోన్ మేకప్: కనుబొమ్మల మొదట్లో నుండి ముక్కు కొనభాగం వరకు ముక్కుభాగం హైలైట్ అయ్యేలా మేకప్ వేయండి. అలాగే కనుబొమ్మల మొదట్లో నుండి సన్నపాటి గీతలు గీయండి. కన్నులకు మేకప్ వేయకూడదు: మీ ముఖంలో ముక్కు హైలైట్ అవ్వాలంటే కన్నులకు మేకప్ వేయవద్దు. కన్నులకు వేసే మేకప్ వల్ల అవతలి వారి దృష్టి ముక్కు మీద నుండి కన్నుల మీకు షిఫ్ట్ అవుతుంది. ఇలాంటి మేకప్ టెక్నిక్స్ తో మీ ముక్కు కొనదేలినట్లుగా అవతలి వారికి కనిపిస్తుంది. సర్జరీలు అవసరం లేదు.