Loading...
Raksha Bandhan : ఈ రాఖీ పండుగ రోజు మీ సోదరికి ఇచ్చే అద్భుతమైన బహుమతులివే..
ఈ రాఖీ పండుగ రోజు మీ సోదరికి ఇచ్చే అద్భుతమైన బహుమతులివే..

Raksha Bandhan : ఈ రాఖీ పండుగ రోజు మీ సోదరికి ఇచ్చే అద్భుతమైన బహుమతులివే..

వ్రాసిన వారు Moogati Shabari
Aug 20, 2026
04:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాఖీ పండుగ అంటే సోదరులు, సోదరీమణుల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకునే ప్రత్యేక రోజు. 2026లో రక్షా బంధన్‌ను ఆగస్టు 28న జరుపుకోనున్నారు. రాఖీ కట్టడంతో పాటు ప్రేమకు గుర్తుగా ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం కూడా ఈ పండుగలో భాగమే. మీరు కూడా ఈ రాఖీకి మీ సోదరికి ప్రత్యేకమైన గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నారా? అయితే రూ.1,000లోపు లభించే ఈ టెక్ గాడ్జెట్లపై ఓ లుక్కేయండి.

వివరాలు

ఈ బహుమతులపై ఓ లుక్కేయండి..

హెయిర్ స్ట్రెయిట్నర్: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో రూ.1,000లోపే మంచి హెయిర్ స్ట్రెయిట్నర్‌లు అందుబాటులో ఉన్నాయి.

రోజూ హెయిర్ స్టైలింగ్ చేసుకునే వారికి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

స్టైలిష్‌గా కనిపించేందుకు ఇష్టపడే మీ సోదరికి ఇది మంచి గిఫ్ట్‌గా ఉపయోగపడుతుంది.

జియో ట్యాగ్: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం రూపొందించిన జియో ట్యాగ్ అమెజాన్‌లో రూ.999కే లభిస్తోంది.

తరచూ ప్రయాణాలు చేసేవారు తమ బ్యాగులు, కీలు, ఇతర వస్తువులను ట్రాక్ చేసేందుకు దీన్ని ఉపయోగించవచ్చు.

ఇందులోని 120డిబి స్పీకర్ సాయంతో వస్తువుల లొకేషన్‌ను సులభంగా గుర్తించవచ్చు.

వివరాలు

రూ.1000లోపు ధరలో లభించేవి ఇవే..

స్మార్ట్‌వాచ్: రూ.1,000లోపు ధరలోనే కొన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి.

వీటిలో బ్లూటూత్ కాలింగ్, హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. డిజిటల్ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడిన వారికి ఇది మంచి గిఫ్ట్‌గా ఉంటుంది.

ఇతర గాడ్జెట్లు: ఇయర్‌బడ్స్, హెయిర్ డ్రయర్లు, పవర్ బ్యాంకులు, పోర్టబుల్ స్పీకర్లు వంటి ఇతర టెక్ గాడ్జెట్లు కూడా రూ.1,000లోపే లభిస్తున్నాయి.

రాఖీ సందర్భంగా మీ సోదరికి ఉపయోగపడే బహుమతిగా వీటిలో మీకు నచ్చినదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

ADVERTISEMENT

వివరాలు

సేల్స్ స్పెషల్..

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో అదిరిపోయే సేల్స్ కొనసాగుతున్నాయి.

ఈ సేల్స్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

సోదరికి లేదా మీ కోసం ప్రీమియం గిఫ్ట్ కొనుగోలు చేయాలని అనుకుంటే.. ఈ ఆఫర్లను కూడా పరిశీలించవచ్చు.

ADVERTISEMENT