ప్రపంచ పర్యాటక దినోత్సవం - 2023 : ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న దేశాలు ఇవే
ప్రతి మనిషి జీవితంలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే విధి నిర్వహణతో అలసిపోయి ఉన్న శరీరానికి కాస్త విరామం అవసరం. సేదా తీరాల్సిన సమయంలో ఎక్కడికైనా టూర్‌కి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. కుటుంబంతో, స్నేహితులతో కలిసి మనస్సుకు ఆహ్లాదకర వాతావరణాన్ని ఇస్తేనే శరీరం పునరుత్తేజం అవుతుంది. ఈ క్రమంలోనే ఏటా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27న జరుపుకుంటారు. పర్యాటక ప్రాముఖ్యత, రాజకీయ,ఆర్థిక విలువలు, సామాజిక, సాంస్కృతికంపై ప్రజలకు అంతర్జాతీయం స్థాయిలో అవగాహన కల్పించేందుకు పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1970లో తొలిసారిగా ఈ ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించింది ప్రపంచ పర్యాటక సంస్థ.అనంతరం UN వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ 1980లో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని సెప్టెంబర్ 27న నిర్వహిస్తూ వస్తోంది.
ప్రపంచ పర్యాటక దినోత్సవం 2023 థీమ్ ఏమిటో తెలుకోండి
ప్రపంచ పర్యాటక దినోత్సవం 2023 థీమ్ ఏంటంటే "టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్. ఇది పర్యాటకంపై పర్యావరణం ప్రభావాన్ని సూచిస్తుంది. ఓవైపు పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్నప్పుడు, మరోవైపు కార్బన్ ఉద్గారాలు, ఆవాసాల నష్టం, సహజ వనరులపై ఒత్తిడి పెరుగుతున్న దృష్ట్యా కొత్త ఆందోళనలు విజృంభిస్తున్నాయి. వీటి పరిష్కారం కోసం గ్రీన్ టూరిజంపై పెట్టుబడే లక్ష్యంగా పనిచేస్తుంది. గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే సుస్థిరత, పర్యావరణ బాధ్యతను గుర్తు చేసే ఆర్థిక సాయంగా నిలిచింది. ఈ ఏడాది ప్రపంచ పర్యాటక దినోత్సవ అధికారిక ఉత్సవాలు- 2023, సౌదీ అరేబియాలోని రియాద్‌లో నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఐరోపా, 2025లో దక్షిణ ఆసియాలో నిర్వహించనున్నారు.
ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న దేశాలు ఇవే
1. ఫ్రాన్స్ గొప్ప సంస్కృతి, కళ, చరిత్ర మరియు వంటకాలకు ప్రసిద్ధి చెందిన ఫ్రాన్స్, ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే దేశాలలో ఒకటిగా స్థిరంగా ఉంది. 2. స్పెయిన్ స్పెయిన్ అందమైన బీచ్‌లు, చారిత్రాత్మక నగరాలు మరియు శక్తివంతమైన సంస్కృతితో సహా విభిన్న ఆకర్షణలను అందిస్తుంది. 3. అమెరికా USAలో జాతీయ ఉద్యానవనాలు వంటి సహజ అద్భుతాల నుండి న్యూయార్క్ మరియు లాస్ ఏంజిల్స్ వంటి దిగ్గజ నగరాల వరకు అనేక రకాల ఆకర్షణలు ఉన్నాయి. 4. చైనా గ్రేట్ వాల్, టెర్రకోట ఆర్మీ మరియు షాంఘై వంటి ఆధునిక నగరాలు వంటి ఆకర్షణలతో చైనా పర్యాటక పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందింది.
అమెరికాతో పాటు ఐరోపా టూర్లు ప్రపంచంలోనే పేరుగాంచాయి
5. ఇటలీ కళలు, చరిత్ర, వాస్తుశిల్పం సహా వంటకాలకు ఇటలీ ప్రసిద్ధి చెందింది. రోమ్, వెనిస్, ఫ్లోరెన్స్ వంటి నగరాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. 6. టర్కీ ఐరోపా, ఆసియాలో విస్తరించిన టర్కీది గొప్ప చరిత్ర. అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, సంస్కృతులతో ప్రత్యేకత సంతరించుకుంది. 7. మెక్సికో అందమైన బీచ్‌లు, పురాతన శిథిలాలు, గొప్ప సంస్కృతిని చూపిస్తుంది. అమెరికా ఖండంలోనే పర్యాటకంలో అగ్రగమ్యస్థానంగా మారింది. 8. జర్మనీ చారిత్రక నగరాలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు, అక్టోబర్‌ఫెస్ట్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది. 9. థాయిలాండ్ అద్భుతమైన బీచ్‌లు, నాణ్యమైన పర్యాటకం చూడాలంటే థాయి వెళ్లాల్సిందే. 10. యూకే లండన్ మ్యూజియం, చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక ఆకర్షణలకు బ్రిటన్ ఘనత వహించింది.