ప్రతీరోజూ ఉదయాన్నే కప్పు కాఫీ.. ఫీలింగ్స్ కే కాదు ఆరోగ్యానికీ టానిక్
కాఫీ అంటే కేవలం ఓ ఎనర్జీ డ్రింక్ మాత్రమే కాదు ఆరోగ్యాన్ని పెంపొందించే ఒక మూడ్, ఒక ఫీలింగ్. మరోవైపు గతంలో భోగాలకు, స్టేటస్ గా భావించే కాఫీ నీరు, ఇప్పుడు మంచి ఆరోగ్యానికి శక్తివంతమైన అమృతంలా రూపాంతరం చెందింది. ఉదయాన్నే కిక్కు కోసం వేడి వేడిగా ఆస్వాదించే కాఫీ శరీరానికి స్వాంతన చేకూర్చుతుంది. దీని సువాసన, రుచి వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఒక్క కప్ కాఫీ, శారీరంలో చిన్న మొత్తంలో ఫోషకాలను అందిస్తాయి. విటమిన్లు B2 (రిబోఫ్లావిన్), B3 (నియాసిన్), B5 (పాంటోతెనిక్ యాసిడ్), B6 (పైరిడాక్సిన్) లాంటివి అందుతాయి. కాఫీలో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ లాంటి ఖనిజాలు సైతం పుష్కలంగా ఉన్నాయి.
మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కాఫిది కీలకపాత్ర
1. మెరుగైన పనితీరు : మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కాఫీది కీలక పాత్రే. ఇందులో సహజసిద్ధంగా ఉండే కెఫిన్, సహజ ఉద్దీపన అడెనోసిన్, మత్తును ప్రోత్సహించే న్యూరోట్రాన్స్‌మీటర్‌ను నిరోధించడం ద్వారా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. 2. యాంటీ ఆక్సిడెంట్లు కాఫీలో రకరకాల యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంది. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. గుండె జబ్బులు, పలు రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థంగా తగ్గిస్తాయి. 3. మెరుగైన శారీరక పనితీరు రోజూవారీ దినచర్యలో భాగంగా వ్యాయామం చేసే వారికి, కాఫీ విలువైన నేస్తం.
కాఫీలోని కెఫిన్ అడ్రినలిన్ విడుదలను ఉత్సాహపర్చుతుంది.
కాఫీలోని కెఫిన్ అడ్రినలిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. అడ్రినలిన్ స్థాయిలను పెంచడం ద్వారా శారీరక పనితీరును పెంచి మనోల్లాసాన్ని అందిస్తుంది. 4. కాలేయానికి స్నేహితుడు కాఫి కాలేయం, ఆరోగ్యానికి కాఫీ తోడ్పాటు అందిస్తుంది. కాఫీ వినియోగంతో కాలేయ క్యాన్సర్, సిర్రోసిస్‌తో సహా ఇతర కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కాఫి సహాయపడుతుంది. 5. న్యూరో వ్యాధులకు ఉపశమనం న్యూరో సమస్యలు, అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి న్యూరో డీజెనరేటివ్ వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు కాఫీ చక్కగా ఉపయోగపడుతుంది. అధిక కెఫీన్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కాన్సర్ కారకాలను నియంత్రణలో సహాయపడుతుంది.