
Aparajita Plant: ఇంట్లో శంఖు పూల ముక్కను పెంచడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
ఇళ్లలో సాధారణంగా కనిపించే కొన్ని ప్రత్యేక మొక్కల్లో అపరాజిత మొక్క(శంఖు పుష్పి) కూడా ఒకటి.
నీలం రంగు పువ్వులతో ఈ మొక్క ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దీన్ని బాల్కనీలో పెంచితే తీగలా వ్యాపిస్తూ అందమైన రూపాన్ని ఇస్తుంది.
ఈ మొక్కను నాటడానికి మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉందని చెబుతారు.
దీని వేర్లు, పువ్వులు ఔషధ గుణాలు కలిగి ఉండి, ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు అందిస్తాయి.
మీ ఇంట్లో అపరాజిత మొక్కను నాటాలని అనుకుంటున్నారా? అయితే, నాటే ముందు దీని వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలను పూర్తిగా తెలుసుకోవడం మంచిది.
లాభాలు
అపరాజిత మొక్క వల్ల కలిగే లాభాలు
ఇంటికి అందమైన రూపం: మీ బాల్కనీ లేదా ఇంటి గార్డెన్‌ను శోభాయమానంగా మార్చే ఈ తీగ మొక్క, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందిస్తుంది.
ఆరోగ్య ప్రయోజనాలు: ఈ మొక్క ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీని వేర్లు ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు.
అపరాజిత పుష్ప టీ: ఈ పువ్వుతో తయారు చేసే బ్లూ టీ ఇప్పుడు ఆరోగ్య ప్రియుల మన్ననలు పొందుతోంది. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడం, మానసిక ఒత్తిడిని తగ్గించడం, నిద్రను మెరుగుపరచడం లాంటి ప్రయోజనాలను కలిగిస్తుంది.
సులభంగా పెంచుకోవచ్చు: అపరాజిత మొక్కను పెంచడానికి ఎక్కువ శ్రద్ధ అవసరం లేదు. బిజీ లైఫ్‌స్టైల్ ఉన్నవారు కూడా దీన్ని సులభంగా సంరక్షించుకోవచ్చు. తక్కువ నీటితోనే పెరుగుతుంది. వివిధ వాతావరణ పరిస్థితుల్లో తట్టుకోగలదు.
నష్టాలు
అపరాజిత మొక్క వల్ల కలిగే నష్టాలు
ఇతర మొక్కలకు ముప్పు: ఈ మొక్కను నిర్లక్ష్యంగా వదిలేస్తే, దాని వేళ్లు అతి వేగంగా వ్యాపించి ఇతర మొక్కలను కప్పేస్తాయి. ఫలితంగా, మిగతా మొక్కల పెరుగుదలకు అవరోధం కలిగించవచ్చు.
తెగుళ్లకు గురయ్యే అవకాశం: అపరాజిత మొక్క తెగుళ్లకు అధికంగా గురయ్యే అవకాశముంది. ఒకసారి తెగులు సోకితే, అది తేలికగా ఇతర భాగాలను నాశనం చేస్తుంది. కాబట్టి, దీన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం చాలా ముఖ్యం.
వాస్తు ప్రభావం: ఈ మొక్కకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దక్షిణ లేదా పశ్చిమ దిశలో పెడితే ప్రతికూల శక్తిని పెంచుతుందని నమ్మకం. కాబట్టి, వాస్తు నిబంధనలను పరిశీలించడం ఉత్తమం.
వివరాలు
శ్రద్ధతో పెంచితే మంచి ఫలితాలు
అపరాజిత మొక్కను ఇంట్లో పెంచడం వల్ల అందం, ఆరోగ్య ప్రయోజనాలు లభించడమే కాకుండా, కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
దీన్ని తగిన శ్రద్ధతో పెంచితే మంచి ఫలితాలు పొందవచ్చు.
ఇంటి శోభను పెంచే ఈ మొక్కను మీరు పెంచాలని అనుకుంటే, ప్రదేశం, దిశ, సంరక్షణ తదితర అంశాలను గమనించడం ఉత్తమం.