రాశి ఫలాలు: కొత్త సంవత్సరం వచ్చేస్తోంది.. ఈ రాశుల వారికి పెళ్ళిళ్ళు
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది కాబట్టి ఆ సంవత్సరం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. రాశిఫలాల ప్రకారం తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఈ రాశి ఫలాలను అక్షతా ఖనోల్కర్ వివరించారు. ముందుగా తుల రాశి.. 2023 సంవత్సరంలో లగ్జరీ వైపు ఈ రాశివారు ఎక్కువ మొగ్గు చూపుతారు. వేసుకునే బట్టల్లో, తినే ఆహారంలో లగ్జరీని వెతుకుతారు. వృత్తిపరంగా అనేక బాధ్యతలు వీరి మీద పడతాయి.
వృశ్చికం: ఈ సంవత్సరం ఎలాంటి భయం లేకుండా అన్నింట్లోనూ ముందుంటారు. మార్చ్, ఏప్రిల్ నెలలో మంచి విషయాలు జరుగుతాయి. వ్యక్తిగత జీవితంలోకి కొత్తవాళ్ళు వస్తారు.
ధనుస్సు: ఆరోగ్యం అనేది ఈ సంవత్సరం కీలకంగా ఉండనుంది.
రాశిఫలాలు
మకరం, కుంభం, మీనం
ధనుస్సు రాశి వారు శారీరక ఇబ్బందుల నుండి బయటపడతారు. పెళ్ళి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మకర రాశి: ఈ రాశి వారికి ఈ సంవత్సరం తమ జీవితంలో పూర్తి స్వేఛ్ఛ లభిస్తుంది. దాంతో పాటు జీవితం మీద ఒక స్పష్టత వస్తుంది. కమ్యూనికేషన్, కళ, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు కొత్త ఎదుగుదలను చూస్తారు.
కుంభం: ఆర్థికంగా ఈ సంవత్సరం బాగా కలిసొస్తుంది. తమ జీవితంలో ఏం కోరుకుంటారో అది దక్కించుకుంటారు. ఒంటరి జీవితాలు జంటగా ముడిపడతాయి. కష్టానికి ఫలితం దొరుకుతుంది.
మీనం: మానసిక భయాలు వీళ్లని కొంచెం ఇబ్బంది పెడతాయి. సరైన ఆహారం, వ్యాయామం చేయడం ద్వారా తమ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు. భయాలు దూరమైతే మంచి ఫలితాలు వస్తాయి.