హోళీ 2023: పండగ పూట నోటిని తీపి చేసే రెసిపీస్
హోళీ అంటే రంగులే కాదు, నోటికి తీపి చేసే ఆహార పదార్థాలు కూడా గుర్తొస్తాయి. రంగుల్లో మునిగి తేలుతూ మీకు నచ్చిన రెసిపీస్ ని ఆస్వాదిస్తే ఆ మజాయే వేరు. అందుకే మీకోసం కొన్ని స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాం. తండై కుల్ఫీ: బాదం, కాజు, గులాబీ రేకులు, కుంకుమ పువ్వు, యాలకులు, సోంఫు గింజలు, గసగసాలను కలిపి గ్రైండర్ లో వేసి పొడి తయారు చేయండి. ఇప్పుడు పాలను మరిగించి అందులో ఈ పొడిని వేయాలి. ఇంకా చక్కెర, ఇలాచీ, చిక్కటి పాలను పోసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని కుల్ఫీ కప్పుల్లో పోసి రిఫ్రిజిరేటర్ లో ఉంచండి. ఆ తర్వాత హ్యాపీగా ఆరిగించడమే.
హోళీ రోజు చేసుకోవాల్సిన వైరైటీ స్వీట్స్
చక్కెర పాళీలు: మైదా పిండిని నెయ్యితో కలిపి పిండిముద్దను తయారు చేయాలి. ఇప్పుడు పిండిని చిన్న బంతుల్లాగా చేసి, చపాతీ లాగా తయారు చేసుకుని చిన్న చతురస్రాల్లాగా చపాతీని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రాగానే పక్కన పెట్టాలి. తర్వాత చక్కెర, నీళ్ళు కలిపి చక్కెర పాకం తయారు చేసి, ఆ పాకంలో వేయించిన చతురస్రాలను ముంచి డీప్ ఫ్రై చేయాలి. గర్జెలు (కజ్జికాయలు): గోధుమ పిండితో ముద్ద చేసి పక్కన పెట్టుకోవాలి. రవ్వను వేయించి అందులో చక్కెర, కొబ్బరి పొడి, ఇలాచీ, బాదం, కాజు వేసి వేయించాలి. ఇప్పుడు పిండిముద్దతో పూరీల్లాగా చేసి వేయించిన రవ్వ మిశ్రమాన్ని పూరీల్లో అమర్చి, నూనెలో ఫ్రై చేయాలి.