హోళీ: మీ పిల్లల ఆరోగ్యం సురక్షితంగా ఉండడానికి పాటించాల్సిన టిప్స్
హోళీ రోజు రంగులతో ఆడడం పిల్లలకి సరదాగా ఉంటుంది. ఐతే రంగులతో అడే సమయంలో మీ పిల్లల ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. రసాయనాలున్న రంగుల నుండి మీ పిల్లలు సురక్షితంగా ఉండడానికి చేయాల్సిన కొన్ని పనులేంటో చూద్దాం. సహజ సిద్ధమైన రంగులు: రసాయనాలున్న రంగుల్లో లెడ్, పాదరసం, అల్యూమినియం బ్రోమైడ్ వంటి మూలకాలు ఉంటాయి. ఇవి చర్మానికి హాని కలగజేస్తాయి. అందుకే పిల్లలకు సహజ సిద్ధమైన రంగులను ఇవ్వండి. వీలైతే రంగులను పసుపు, శనగపిండి, హెనా వాటి ద్వారా ఇంట్లోనే రంగులను తయారు చేయండి. ముఖం, చెవులు, ముక్కు భాగాల్లో రంగులు జల్లకూడదని చెప్పండి. వాటర్ బెలూన్స్ వంటివి వాడకపోతేనే మంచిదని గుర్తుంచుకోండి.
హోళీ రోజు పిల్లల రక్షణం కోసం తల్లిందండ్రులు పాటించాల్సిన టిప్స్
పొడవైన బట్టలు తొడగండి: పిల్లలకు పాత బట్టలు వేయడమే మంచిది. అవి కూడా పొడుగాటి డ్రెస్సులు, చర్మం కనిపించకుండా కవర్ చేసే డ్రెస్సులైతే బెటర్. ఆడవాళ్ళకి ఫుల్ స్లీవ్స్, మగవాళ్ళకి ఫుల్ హ్యాండ్స్ ఉండాలి. హోళీ అవగానే తడిసిన బట్టలను వెంటనే మార్చేసుకోవాలి. చర్మాన్ని రక్షించుకోండి: హోళీ ఆడడానికి పిల్లలు ఇంట్లోంచి అడుగు బయట పెట్టే ముందు వాళ్ళ చర్మాన్ని కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, ఆవాల నూనె తో మర్దన చేయండి. దీనివల్ల రంగులు చర్మానికి అతుక్కోవు. ఆయిల్ కాకపోతే మాయిశ్చరైజర్ అప్లై చేసినా సరిపోతుంది. జుట్టుకు నూనెతో మర్దన: హోళీ ఆడడానికి ముందు వాళ్ల జుట్టుకు కొబ్బరి నూనె రాయండి. ఎక్కువ వెంట్రుకలున్న ఆడపిల్లలకు పోనీ టెయిల్ వేయండి.