హోళీ రోజు అబ్బాయిలు ఎలాంటి డ్రెస్ వేసుకుంటే బాగుంటుందంటే
హోళీ రోజు జనరల్ గా అబ్బాయిలందరూ పాత బట్టలు వేసుకుంటారు. రంగులు పడతాయని బట్టలు పాడవుతాయని అనుకుంటారు. కానీ కొంత టైమ్ తీసుకుని హోళీ డ్రెస్ ని సెలెక్ట్ చేసుకుంటే, ఈ పండగ మరింత ఆనందంగా ఉంటుంది. ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో మీకు అర్థం కాకపోతే ఈ సలహాలు తెలుసుకోండి. వైట్ కుర్తా: పండగ రోజు కుర్తాను మించినది ఏముంటుంది? మీ బాడీకి తగినట్లుగా ఉండే కుర్తా సెలెక్ట్ చేసుకుని, జీన్స్ ప్యాంట్ వేస్తే బాగుంటుంది. కాళ్ళకు లోఫర్స్ వేయండి. లుక్ మారిపోతుంది. షార్ట్ కుర్తా: నార్మల్ కుర్తా మరీ ఫార్మల్ గా ఉందనిపిస్తే, షార్ట్ కుర్తా వైపు వెళ్ళండి. ట్రెండీగా ఉండాలనుకుంటే ప్రింటెడ్ కుర్తాస్ ఎంచుకోండీ. ఇక్కత్ కుర్తాస్ బాగుంటాయి.
హోళీ రోజు వేసుకోవాల్సిన డ్రెస్సెస్
గ్రాఫిక్ టీ షర్ట్: సింపుల్ గా ఉండాలంటే గ్రాఫిక్ టీ షర్ట్ సెలెక్ట్ చేసుకోండి. టీ షర్ట్ మీద కొంచెం ఫన్నీగా ఉండే కొటేషన్ ఉంటే ఇంకా బాగుంటుంది. కాళ్ళకు షూస్ వేయండి, అదిరిపోతుంది. వైట్ షర్ట్, వైట్ షార్ట్: రాయల్ లుక్ లో కనిపించాలంటే వైట్ షర్ట్, వైట్ షార్ట్ బాగుంటాయి. ట్రై చేయండి. వైట్ మీద పడిన రంగులు కూడా అద్భుతంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఫోటోలకు వైట్ సరిగ్గా సరిపోతుంది. వైట్ సాక్స్ వేసుకుని షూస్ వేసుకుంటే స్టైలిష్ గా ఉంటుంది. పంచెకట్టు: మీ ఇంట్లో హోళీ రోజు ప్రత్యేక పూజలు ఉంటే పంచెకట్టు కట్టుకోండి. మీకు నచ్చిన కలర్ లో పంచె తీసుకుని దానికి సరిపడా షర్ట్ వేసుకోండి.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి