LOADING...
Instant Nuvvula Bobbatlu: నువ్వులు-బెల్లంతో టేస్టీ బొబ్బట్లు.. హోలీకి బెస్ట్ స్వీట్ రెసిపీ
నువ్వులు-బెల్లంతో టేస్టీ బొబ్బట్లు.. హోలీకి బెస్ట్ స్వీట్ రెసిపీ

Instant Nuvvula Bobbatlu: నువ్వులు-బెల్లంతో టేస్టీ బొబ్బట్లు.. హోలీకి బెస్ట్ స్వీట్ రెసిపీ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2026
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

బొబ్బట్లు అంటే తెలుగు ఇంటింటా ఎంతో ఇష్టంగా చేసుకునే సంప్రదాయ స్వీట్. లోపల నిండుగా ఉండే తీపి స్టఫింగ్‌, పై నుంచి కొద్దిగా నెయ్యి వేసి తింటే రుచి మరింత పెరుగుతుంది. అందుకే వీటిని చాలా మంది ప్రత్యేక పండుగల సమయంలో తప్పకుండా తయారు చేస్తారు. ప్రాంతాన్ని బట్టి వీటిని పూరన్ పోలీ, ఒబ్బట్టు, భక్ష్యాలు, పోలె వంటి పేర్లతో కూడా పిలుస్తారు. సాధారణంగా బొబ్బట్లను పెసరపప్పు లేదా శనగపప్పుతో తయారు చేస్తారు. అయితే ఈసారి కొంచెం భిన్నంగా నువ్వులతో బొబ్బట్లు తయారు చేసి చూడండి. మామూలు బొబ్బట్ల కంటే ఇవి మరింత రుచిగా ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా వంట నేర్చుకుంటున్నవారు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తే సులభంగా తయారు చేసుకోవచ్చు.

వివరాలు 

కావాల్సిన పదార్థాలు

ఇక నోరూరించే నువ్వుల బొబ్బట్లు ఎలా చేయాలి? వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటి? తయారీ విధానం ఎలా ఉంటుంది? ఇప్పుడు చూద్దాం. గోధుమపిండి - 6 కప్పులు నువ్వులు - 4 కప్పులు బెల్లం తురుము - 4 కప్పులు నెయ్యి - 14 టీ స్పూన్లు యాలకులు - 8 ఉప్పు - కొద్దిగా

వివరాలు 

తయారీ విధానం

ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టి వేడి చేయాలి. అందులో నాలుగు కప్పుల నువ్వులు వేసి మోస్తరు మంటపై దోరగా వేయించాలి. నువ్వులు వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్‌లో వేయించిన నువ్వులు మరియు ఎనిమిది యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత అదే జార్‌లో నాలుగు కప్పుల బెల్లం తురుము వేసి మధ్యమధ్యలో కలుపుతూ బాగా మిక్సీ పట్టాలి. దీంతో బొబ్బట్లకు ఉపయోగించే తీపి స్టఫింగ్ సిద్ధమవుతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఆరు కప్పుల గోధుమపిండి మరియు కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. తరువాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా మృదువుగా కలపాలి.

Advertisement

వివరాలు 

తయారీ విధానం

పిండిని కలిపిన తర్వాత అందులో ఎనిమిది టీ స్పూన్ల నెయ్యి వేసి మరోసారి బాగా మిక్స్ చేయాలి. అనంతరం పిండిపై మూత పెట్టి సుమారు పదిహేను నిమిషాలు నాననివ్వాలి. 15నిమిషాల తర్వాత పిండిని మరోసారి ముద్దలా కలిపి చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీటపై ఒక్కో ఉండను పెట్టి చపాతీలా రోల్ చేయాలి. ఆ తరువాత మధ్యలో ముందుగా సిద్ధం చేసుకున్న నువ్వులు-బెల్లం మిశ్రమాన్ని ఉంచి సైడ్స్ మూసేయాలి.ఆ ముద్దను నెమ్మదిగా కర్రతో పలుచగా చపాతీలా వత్తాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి వేడి చేయాలి. పాన్ వేడెక్కిన తర్వాత వత్తిన బొబ్బట్టును వేసి ఒక నిమిషం పాటు కాల్చాలి.తరువాత మరోవైపు తిప్పి కొద్దిగా నెయ్యి రాసి మళ్లీ కాల్చాలి.

Advertisement

వివరాలు 

తయారీ విధానం

రెండు వైపులా బాగా కాలిన తర్వాత బొబ్బట్టును తీసి ప్లేట్‌లో పెట్టాలి. ఇదే విధంగా మిగతా బొబ్బట్లను కూడా తయారు చేసుకోవాలి. ఇలా చేస్తే నోరూరించే టేస్టీ నువ్వుల బొబ్బట్లు సిద్ధమవుతాయి. ఎక్కువ మోతాదులో చేయాలనుకుంటే గోధుమపిండి, నువ్వులు, బెల్లం మరియు ఇతర పదార్థాల పరిమాణాన్ని అదే నిష్పత్తిలో పెంచుకోవచ్చు.

వివరాలు 

హోలీ స్పెషల్

హోలీ పండుగ సందర్భంగా ఇంట్లో తీపి వంటలు చేయడం ఒక సంప్రదాయం. రంగుల పండుగ రోజున కుటుంబసభ్యులతో కలిసి తినడానికి నువ్వుల బొబ్బట్లు అద్భుతమైన స్వీట్‌గా నిలుస్తాయి. పై నుంచి నెయ్యి వేసి వేడిగా సర్వ్ చేస్తే పండుగ ఆనందం మరింత పెరుగుతుంది. హోలీ సందర్భంగా ఈ ప్రత్యేక స్వీట్‌ను తప్పకుండా ట్రై చేసి చూడండి.

Advertisement