ఈగలు ఇబ్బంది పెడుతున్నాయా? వాటిని తరిమి కొట్టడానికి పాటించాల్సిన ఇంటి చిట్కాలు
వ్యాధులను వ్యాపింపజేసే సూక్ష్మ క్రిములను ఈగలు మోసుకొస్తాయి. చాలావరకు రోగాల బారిన పడటానికి ఈగలు కారణమవుతాయి. ఈ నేపథ్యంలో ఈగల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. బయట చెత్తాచెదారాలపై వాలిన ఈగలు ఇంట్లోకి వచ్చి ఆహార పదార్థాలపై వాలి ఆహారాన్ని కలుషితం చేస్తాయి. అయితే ఈగలు ఇంట్లోకి రాకుండా కొన్ని చిట్కాలు పనిచేస్తాయి, అవేంటో తెలుసుకుందాం. ఆపిల్ సైడర్ వెనిగర్ కుళ్ళిన లేదా పులియబెట్టిన వాసనలకు ఈగలు అట్రాక్ట్ అవుతాయి. అందువల్ల ఆపిల్ సైడర్ వెనిగర్, ఈగలను తరిమికొట్టడంలో బాగా పనిచేస్తుంది. ఒక పాత్రలో కొంత ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి, పాత్రలు తోమే సబ్బును నీళ్ళలో ముంచి అందులో వేయాలి. దీనివల్ల ఈగలు ఆ పాత్రలో పడిపోతాయి.
ఈగలను తరిమికొట్టే అల్లం
రెండు చెంచాల అల్లం పొడి తీసుకుని ఒక పాత్రలో వేసి నాలుగు కప్పుల నీళ్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి వడపోసి ఆ నీటిని ఒక బాటిల్లో పోసి ఈగల కనిపించినప్పుడు స్ప్రే చేస్తే సరిపోతుంది. తులసి కొన్ని తులసి ఆకులను తీసుకొని ముక్కలుగా కత్తిరించి వేడి నీళ్లలో వేయాలి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ నీటిని ఒక పాత్రలోకి వడపోసి, ఈగలు కనిపించినప్పుడు స్ప్రే చేయాలి. ఘాటు మిరియాలు రెండు నుంచి మూడు కప్పుల ఘాటు మిరియాలను తీసుకొని నాలుగు కప్పుల వాటర్ లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు నీటిని ఒక బాటిల్ లోకి వడపోసి స్ప్రే చేస్తే బాగుంటుంది.