
Glowing Skin: తక్కువ ఖర్చుతో లేకుండా సులువుగా మీ అందాన్ని పెంచుకోండి ఇలా..!
ఈ వార్తాకథనం ఏంటి
తమ ముఖాన్ని అందంగా మార్చుకోవడానికి అమ్మాయిలు చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.
దీని కోసం కృత్రిమ మార్గాలకు బదులుగా ఇంట్లో దొరికే వస్తువులతో ప్రయత్నించడం మంచిది.
డబ్బు ఖర్చు లేకుండా ఇంట్లోనే మనం చేసుకునే అనేక హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి ఎటువంటి హాని కలిగించనివి. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Details
పెరుగు,ఆరేంజ్ తొక్కల పొడితో :
ఆరెంజ్ తొక్క , పెరుగు ఫేస్ ప్యాక్ ను సులభంగా తయారు చేసుకోవచ్చు.
అరేంజ్ తొక్కల పొడి ఒక స్పూన్ అలాగే పెరుగు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి.
ఇప్పుడు, ఈ పేస్ట్ ని మీ ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోండి.
ఈ ప్యాక్ వల్ల మీ ముఖం మీద ఉన్న మచ్చలు తగ్గించటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ముఖం అందంగా తెల్లగా మెరిసిపోతుంది.
Details
కలబంద, పెరుగు :
కలబంద లోపల ఉండే జెల్,పెరుగు మీగడ ఒక టేబుల్ స్పూన్ తేనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, ఒక టేబుల్ స్పూన్ శెనగపిండి, హాఫ్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని పేస్ట్ లా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఉంచుకుని అనంతరం చల్లని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.