చెదపురుగులతో ఇంట్లో సమస్యగా ఉందా? ఈ ఇంటి చిట్కాలు పాటించండి
కలపతో తయారైన వస్తువులు ఇంట్లో ఉంటే చెదపురుగుల సమస్య ఖచ్చితంగా ఉంటుంది. చెదపురుగులను చెదరగొట్టడం కష్టమైన పని, ఖర్చు కూడా ఎక్కువ. ప్రస్తుతం చెదపురుగులను తొలగించే ఇంటి చిట్కాలు తెలుసుకుందాం. ఆరెంజ్ ఆయిల్: చెదపురుగుల సమస్య తక్కువగా ఉన్నట్లయితే ఆరెంజ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఇందులో డీ-లిమోనిన్ ఉంటుంది. ఆరెంజ్ ఆయిల్ ని డైరెక్ట్ గా చెదపురుగుల మీద స్ప్రే చేయాలి. లవంగాల నూనె: 2001లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం 100% చెదపురుగులు లవంగాల నూనె ద్వారా రెండు రోజుల్లో చచ్చిపోతాయని తెలిసింది. ఒక కప్పు నీళ్లలో మూడు నుంచి నాలుగు చుక్కల లవంగాల నూనెను వేసి బాగా మిక్స్ చేసి చెదల మీద స్ప్రే చేయాలి.
చెదలు మళ్ళీ రాకుండా చేసే వేపనూనె
ఆపిల్ సైడర్ వెనిగర్ ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఎసిటిక్ ఆమ్లము ఉంటుంది. ఈ కారణంగా ఇంట్లో ఉన్న చెదపురుగులు పూర్తిగా తొలగిపోతాయి. ఒక చిన్న పాత్రను తీసుకొని అందులో రెండు నిమ్మకాయల రసాన్ని పిండి దానికి కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ ని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాటిల్లో పోసి స్ప్రే చేయాలి. వేప నూనె ఇది సహజ సిద్ధమైన క్రిమిసంహారిణి. వేప నూనె వల్ల చెద పురుగులు చనిపోవడమే కాకుండా అవి మళ్ళీ రావడం కూడా ఆగిపోతుంది. వేప నూనెలోని రసాయనాలు చెదపురుగుల పునరుత్పత్తి వ్యవస్థ మీద ప్రభావం చూపుతాయి. వేప నూనెను తీసుకొని ఎక్కడైతే చెదలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతంలో జల్లితే సరిపోతుంది.