శరీరంలో హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి కాకపోవడానికి లేదా ఎక్కువ ఉత్పత్తి కావడానికి కారణాలివే
ఈ వార్తాకథనం ఏంటి
శరీర క్రియలు సరిగ్గా జరగాలంటే హార్మోన్లు సరైన మోతాదులో ఉత్పత్తి కావాలి. హార్మోన్లలో అసమానతలు కలిగితే అవి శరీరం మీద ప్రభావాన్ని చూపిస్తాయి.
అతిగా లావు పెరగడం, చక్కెర వ్యాధి, హృదయ సంబంధ సమస్యలు హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్లనే సంభవిస్తాయి. ప్రస్తుతం హార్మోన్ల అసమానతలకు కారణాలేంటో తెలుసుకుందాం.
నిద్రలేకపోవడం:
నిద్ర విషయంలో కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు. రోజంతా అలసిపోయిన శరీరానికి కాస్తంత విశ్రాంతి అవసరం.
అలా కాకుండా రాత్రుళ్ళు కూడా పనిచేస్తూ నిద్ర తగ్గించుకుంటే హార్మోన్లలో అసమానతలు ఏర్పడతాయి. ఈ కారణంగా ఒత్తిడి, అలసట ఎక్కువవుతుంది.
సమయానికి తినకపోవడం:
సరైన సమయానికి తిండి లేకపోతే శరీర గడియారం దెబ్బతింటుంది. దానివల్ల హార్మోన్ల ఉత్పత్తిలో మార్పులు వస్తాయి.
Details
మేకప్ సాధనాల్లోని రసాయనాల వల్ల హార్మోన్లలో అసమానతలు
టీ, కాఫీ:
టీ లేదా కాఫీల్లో ఉండే కెఫిన్ కారణంగా ఒత్తిడిని పెంచే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఒత్తిడి ఎక్కువైతే మీరు సరిగ్గా ఆలోచించలేరు.
అప్పుడు మీరు చేస్తున్న పని మీద ప్రభావం పడుతుంది. చిరుతిళ్ళు, ఆల్కహాల్ సేవనం మొదలగు వాటివల్ల కూడా హార్మోన్ల ఉత్పత్తిలో మార్పులు వస్తాయి.
రసాయనాలు ఉండే సాధనాలు:
మేకప్ కి ఉపయోగించే సాధనాల్లోని రసాయనాలు కూడా హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. ప్లాస్టిక్ కవర్లలో నిల్వ ఉండే ఆహారాలు తినకపోవడమే మంచిది.
శరీరం అనుకూలించనపుడు చేసే వ్యాయామం:
వ్యాయామం కూడా హార్మోన్లలో అసమతుల్యతను తీసుకొస్తుంది. శరీరం అనుకూలించని సమయాల్లో కష్టపడుతూ వ్యాయామం చేస్తే హార్మోన్లలో మార్పులు వస్తాయి.