ప్రపంచ నిద్రా దినోత్సవం: మీరు సరిగా నిద్రపోతున్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ సంవత్సరం మార్చి 17వ తేదీన ప్రపంచ నిద్రా దినోత్సవాన్ని జరుపుకుంటారు. నిద్ర లేకపోవడం వల్ల వచ్చే అనర్థాల గురించి అవగాహన చేయడానికి నిద్రా దినోత్సవాన్ని జరుపుతారు.
ప్రస్తుతం చాలామందికి సరిగ్గా నిద్ర ఉండటం లేదు. కొంతమంది అసలు నిద్ర పోలేకపోతున్నారు. మరికొంతమందికి కావాల్సినంత నిద్ర దొరకడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
సరైన నిద్ర లేకపోవడానికి ముఖ్య కారణం ఒత్తిడి. అవును, చేస్తున్న పని, ఫ్యామిలీ రిలేషన్స్, డబ్బు, ఇలా చాలా విషయాలు నిద్రను దూరం చేస్తున్నాయి.
ప్రయాణాలు ఎక్కువగా చేయడం సోషల్ మీడియాకు బానిసగా మారడం ఆహార అలవాట్లు సరిగా ఉండకపోవడం అర్ధరాత్రులు పనిచేయడం మాదకద్రవ్యాలు తీసుకోవడం కూడా నిద్రలేమికి కారణమవుతున్నాయి.
నిద్రా దినోత్సవం
నిద్ర లేకపోతే కలిగే ఇబ్బందులు, వ్యాధులు
నిద్ర సరిగా లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులు
కావలసినంత నిద్ర లేకపోతే రోజువారి సమయంలో ఆవలింతలు ఎక్కువగా వస్తాయి. అలసట ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి, కంటి చూపు సమస్యలు యాంగ్జాయిటీ, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, తరచుగా మూడ్ మారిపోవడం, చికాకుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నిద్ర సరిగా లేకపోతే వచ్చే వ్యాధులు
సరైన నిద్ర లేకపోవడం వల్ల మానేసికంగా, శారీరకంగా అనేక వ్యాధులు అంటుకుంటాయి.
రోగనిరోధక శక్తి బలహీనమైపోతుంది. బరువు పెరుగుతారు, గుండె సంబంధిత సమస్యలు, చక్కెర వ్యాధి, బీపీ పెరగడం సమస్యలు వస్తాయి.
నిద్రలేమిని దూరం చేయాలంటే
ఏ విషయంలోనైనా ఒత్తిడి తీసుకోకూడదు. ఒత్తిడిని తగ్గించే యోగా, వ్యాయామం చేయాలి. రాత్రిపూట ప్రాణాయామం చేస్తే సరైన నిద్ర వచ్చే అవకాశం ఉంది.