
ఆరోగ్యం: మధ్య వయసులో మాటిమాటికీ అలసిపోతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
క్రానిక్ ఫాటిగ్ సిండ్రోమ్ అనేది ఒక డిజార్డర్. తీవ్రమైన అలసట, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, కండరాల నొప్పి, కీళ్ళనొప్పి, నిద్ర పట్టకపోవడం అనే లక్షణాల ఈ డిజార్డర్ కలుగుతుంది.
సాధారణంగా మధ్య వయసు ఆడవాళ్ళలో ఈ డిజార్డర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఇబ్బంది అంత తొందరగా తగ్గదు. దాదాపు 6నెలల వరకూ ఉంటుంది. దీనికి సరైన ట్రీట్ మెంట్ కూడా లేదు.
క్రానిక్ ఫాటిగ్ సిండ్రోమ్ అంటే:
తీవ్రమైన అలసట, బద్దకంగా ఉండడమే క్రానిక్ ఫాటిగ్ సిండ్రోమ్. దీని కారణంగా శరీరంలోని ఇతర భాగాలు దెబ్బతింటాయి.
రావడానికి గల కారణాలు:
తీవ్రమైన ఒత్తిడి, రోగనిరోధక శక్తి తగ్గడం, హార్మోన్లలో మార్పులు, అదీగాక బాక్టీరియా, ఫంగల్ ఇనెఫెక్షన్లు కలిగిన తర్వాత కూడా ఇలాంటి ఇబ్బంది వస్తుంది.
ఆరోగ్యం
క్రానిక్ ఫాటిగ్ సిండ్రోమ్ లక్షణాలు, ట్రీట్ మెంట్
హెర్పిస్ వైరస్, రూబెల్లా వైరస్, ఎప్ స్టీన్ బార్ వైరస్ కారణంగా క్రానిక్ ఫాటిగ్ సిండ్రోమ్ కలుగుతుంది.
లక్షణాలు:
ఈ సిండ్రోమ్ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటాయి. అలసట తో పాటు ఒత్తిడి, నిద్రలేకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, బద్దకం, కండరాల నొప్పులు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ పరిస్థితిని ఎలా కనుగొనాలి?
దీన్ని కనుక్కోవడం చాలా కష్టం, సరైన డయాగ్నసిస్ సిస్టమ్ లేదని చెప్పవచ్చు. అందుకే మెడికల్ హిస్టరీ ద్వారా కనుక్కునే అవకాశం ఉంటుంది.
ట్రీట్ మెంట్:
దీనికి ఖచ్చితమైన ట్రీట్ మెంట్ లేదు. జీవన శైలిలో మార్పుల ద్వారా ఈ పరిస్థితి తాలూకు లక్షణాలను తగ్గించవచ్చు. ఆల్కహాల్, నికోటిన్ తీసుకోకూడదు. కావాల్సినంత నిద్రపోతూ, ఒత్తిడి లేకుండా ఉండాలి.