
మెంటల్ వీక్ నెస్ పై జనాల్లో ఉన్న అపోహాలను ఇప్పుడే వదిలేయండి
ఈ వార్తాకథనం ఏంటి
రోజువారి పనుల్లో యాక్టివ్ గా ఉండడానికి శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, మానసికంగా బలంగా ఉండాలి. కానీ వ్యసనాలు, ఒత్తిడి, డిప్రెషన్, స్క్రిజోఫీనియా, ఈటింగ్ డిజార్డర్స్ మొదలగు వాటివల్ల మానసికంగా వీక్ అవుతారు.
ఐతే మానసికంగా బలహీనంగా మారినపుడు దాన్నుండి బయటపడటం కష్టమవుతుందని అంటారు. ప్రస్తుతం మానసిక బలహీనత గురించి జనంలో ఉన్న అపోహాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
అపోహా - మానసిక బలహీనత అనేది శారీరక బలహీనతే
ఇది నిజం కాదు. మానసికంగా బలహీనంతా మారితే శారీరకంగా బలహీనంగా మారినట్టు కాదు. ఇది నిజమని చెప్పడానికి ఎలాంటి ఆధారమూ లేదు. ఇంకో విషయం ఏంటటే ఈ బలహీనత ఎవ్వరిలోనైనా ఎప్పుడైనా కలగవచ్చు.
మానసిక ఆరోగ్యం
మానసిక బలహీనత గురించి మరిన్ని విషయాలు
అపోహా - మానసిక బలహీనతకు చికిత్స లేదు
ఇది పూర్తిగా అబద్ధం. కొన్ని మానసిక సమస్యలు తగ్గడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది తప్ప మానసిక సమస్యలకు మందు లేదనడం, అవి తగ్గవనుకోవడం అపోహా. సరైన ట్రీట్ మెంట్ తో మానసిక సమస్యలు పూర్తిగా నయమవుతాయి.
అపోహా - పాజిటివ్ గా ఉంటే మానసికంగా బలం వస్తుంది
ప్రతీ సమస్యకు పాజిటివిటీ అనేది మందు కాదు. ఇంకా చెప్పాలంటే మరీ ఎక్కువ పాజిటివిటీ కూడా కూడా పాయిజన్ లా మారుతుంది. బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధను పూర్తిగా అనుభవించడమే మంచిదని కొందరు మానసిక వైద్యులు సలహా ఇస్తారు.
మానసిక వైద్యులు అందించే మందులు వేసుకోకూడని కూడా జనాలు నమ్ముతారు. కానీ అది అబద్ధం.