దుఃఖాన్ని ఆపుకుంటూ సంతోషం కోసం చూస్తున్నారా? పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నట్టే
బాధగా ఉంటే బాధపడాలి, సంతోషంగా అనిపిస్తే ఎగిరి గంతేయాలి. అంతేకానీ బాధల్లో ఉన్నప్పుడు పాజిటివిటీని వెతుక్కుని మరీ సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తే అది మీ పాలిట యమపాశంలా మారి మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అతి మంచితనం ఎంత నష్టం చేస్తుందో ప్రతీదీ మంచికోసమే జరుగుతుందనీ, కారణం లేకుండా ఏదీ జరగదనీ, ఏడవాల్సిన అవసరం లేదనీ, దుఃఖం పొంగుకొస్తున్నా కూడా కంట్రోల్ చేసుకోవడం కోసం ఆ బాధలోనే పాజిటివ్ అంశాలు వెతుక్కోవడం మంచిది కాదు. బాధలో పాజిటివిటీ వెతుక్కుంటే నిజ జీవితంలోని సమస్యల మీద పోరాడే శక్తిని కోల్పోతారు. పరిస్థితులు ప్రతికూలంగా మారితే ఎలా ఎదుర్కోవాలో తెలియకుండా పోతుంది. అలంటి పరిస్థితుల నుండి పారిపోవాలని చూస్తారు తప్ప పరిష్కరించాలని అనుకోరు.
మనుషులకు ఎమోషన్స్ సహజమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి
బాధ పడుతున్నప్పుడు పాజిటివ్ గా ఆలోచించడాన్ని మానుకోవాలంటే బాధపడటాన్ని ఒప్పుకోవాలి. పరిస్థితులను బట్టి ఒత్తిడి, యాంగ్జాయిటీ, కోపం, బాధ, ఏడుపు అన్నీ మనుషుల్లో ఉంటాయని తెలుసుకోండి. బాధనిపిస్తే బాధపడండి, ఏడవాలనిపిస్తే ఏడవండి. ఆ తర్వాత మీ దృష్టిని వేరే విషయాల పైకి మళ్ళించండి. సంతోషంగా ఉన్నప్పుడు ఈరోజు ఎందుకింత సంతోషంగా ఉన్నావ్ అని నిన్ను నువ్వు ఎప్పుడూ ప్రశ్నించుకోవు. మరలాంటప్పుడు బాధలో ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నిస్తావ్. ఏడవాలనిపిస్తే ఏడ్చెయ్. ప్రతీ ఆవేశాన్ని లోతుగా అనుభవించు, బాగాలేకపోవడం కూడా మనిషి జీవితంలో సహజమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. నీ పరిస్థితి బాగాలేనపుడు అవతలి వాళ్ళ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ఉండాలని అనుకోకు. లేదంటే ముందు చెప్పినట్టు మీరు చిక్కుల్లో పడతారు.