Ghee: మీ ఆరోగ్యానికి సరైన నెయ్యిని ఎలా ఎంచుకోవాలి?
నెయ్యి మన ఆహార జీవితంలో నెయ్యికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. నెయ్యి ఆహార రుచిని మెరుగుపరచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. నెయ్యి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. అందుకే నెయ్యిని కొన్ని యుగాలుగా వాడుకలో ఉంది. నెయ్యిని వివిధ రకాలుగా చేస్తారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్ని రకాల నెయ్యిలో ఒకే రకమైన ప్రయోజనం ఉండదు. వాణిజ్యపరంగా ప్రాసెస్ చేయబడిన అనేక నెయ్యిల్లో పోషకాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో రెండు రకాల నెయ్యి అందుబాటులో ఉంది. అందులో ఒకటి బిలోనా నెయ్యి.. రెండోది సాధారణ నెయ్యి.
బిలోనా నెయ్యి బెటర్
పాలను వేడి చేయడం ద్వారా వచ్చే మలై నుంచి సాధారణ నెయ్యి తయారు చేస్తారు. పెరుగుపై పేరుకుపోయిన మలై నుంచి నెయ్యి తయారు చేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని ప్రయోజనాలు పెరుగు ద్వరా తయారు చేసిన నెయ్యిలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పాల నుంచి తయారు చేసిన నెయ్యిలో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉండవని అంటున్నారు. బిలోనా నెయ్యిలో ఎక్కువ విటమిన్లు, పోషకాలను కలిగి ఉంటుంది. ఎందుకంటే దీన్ని తక్కువ వేడి చేసే పద్ధతిని ద్వారా తయారు చేస్తారు. ఇలా చేయడం వల్ల నెయ్యికి మంచి రుచి, సువాసన వస్తుంది. అలాగే వంటలను నూనేతో కాకుండా నెయ్యితో వండాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.