Page Loader
దంతాల సంరక్షణ కోసం ఉత్తమమైన టూత్‌పేస్ట్‌ను ఎలా ఎంచుకోవాలంటే? 
సరైన టూత్ పెస్ట్ తో అందమైన చిరునవ్వు

దంతాల సంరక్షణ కోసం ఉత్తమమైన టూత్‌పేస్ట్‌ను ఎలా ఎంచుకోవాలంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 08, 2023
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

నోటిని శుభ్రంగా కాపాడుకోవడంలో టూత్ పేస్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. మార్కెట్లో అనేక రకాల టూత్ పేస్టులు అందుబాటులో ఉంటాయి. బహుళజాతి కంపెనీలు తమ టూత్‌పేస్ట్‌లను విక్రయించడానికి కోట్లాది రూపాయలతో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తుంటాయి. దీంతో ఏ టూత్ పెస్ట్ మంచిదో కొన్నిసార్లు అర్థంకాదు. దంతాలు, చిగుళ్లు ఆరోగ్య ఉండటానికి ఏ టూత్ పేస్ట్ ఉత్తమమైనదో తెలుసుకోవడానికి STIM ఓరల్ కేర్ డైరెక్టర్ విరెన్ ఖుల్లర్‌‌ను NewsBytes సంప్రదించింది. ఆయన ఏం చెప్పారో తెలుసుకుందాం.. ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ టూత్ ఎనామెల్‌ను బలపరుస్తుంది, ఫ్లోరైడ్ పంటి ఎనామెల్‌పై రక్షిత పొరను ఏర్పరుస్తుంది. కావిటీస్‌ను నిరోధించడంలో సహాయపడుతుంది. దంతవైద్యుడు ప్రత్యేకంగా సలహా ఇస్తే తప్ప ఈ రకం టూత్ పేస్ట్‌లను వాడకూడదు.

Details

 వైటెనింగ్ టూత్‌పేస్ట్ దంతాలపై మరకల తొలగింపు

వైటెనింగ్ టూత్‌పేస్ట్ "వైటెనింగ్ టూత్‌పేస్ట్ దంతాలపై మరకలు తొలగించి, అందమైన చిరునవ్వును అందించడానికి సాయపడుతుంది. ఈ టూత్‌పేస్ట్‌లో తరచుగా తేలికపాటి అబ్రాసివ్‌లు, రసాయన కారకాలు ఉంటాయి. ఇవి మెల్లగా పాలిష్ చేయడంలో, ఎనామెల్ లో ఏర్పడే మరకలను నివారిస్తుంది. డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్ వేడి, చల్లని, తీపి లేదా పుల్లని ఆహారాలు, పానీయాలు తీసుకున్నప్పుడు దంతాల దగ్గర జివ్వుమని అనిపిస్తే డీసెన్సిటైజ్ టూత్ పెస్ట్ వాడడం వల్ల ఉపశమనం కలుగుతుంది. డీసెన్సిటైజింగ్ టూత్‌పేస్ట్‌ను ప్రతి రోజు వాడడం వల్ల దంతాల్లో ఉండే సున్నితత్వం తగ్గిపోతోంది. దీంతో అంతర్లీన వ్యాధి ప్రబిలే అవకాశం ఉంది.

Details

పిల్లలకు తక్కువ ఫ్లోరైడ్ టూత్ పెస్ట్ ఇవ్వాలి

రీమినరలైజింగ్ టూత్‌పేస్ట్ రీమినరలైజింగ్ టూత్‌పేస్ట్ అనేది ఒక రకమైన టూత్‌పేస్ట్. ఇది బ్యాక్టీరియా, ఆమ్ల ఆహారాలు, పానీయాల నుండి యాసిడ్ దాడుల కారణంగా పంటి కోల్పేయే కాల్షియాన్ని తిరిగి పునరుద్ధరిస్తుంది. అదే విధంగా దంతాల ఎనామెల్‌ను బలోపేతం చేసి, దంత క్షయాన్ని నివారిస్తుంది. పిల్లల టూత్ పేస్టు పిల్లల టూత్ పెస్ట్‌లో అదనపు జాగ్రత్తలు పాటించాలి. వారి కోసం సరైన టూత్ పెస్ట్ ను ఎంచుకోవడం చాలా ఉత్తమం. పిల్లల దంతాలు సున్నితంగా ఉంటాయి. అందువల్ల, వారికి తక్కువ ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్ ఇవ్వాలి.