చలికాలం: కాపీ తాగడం అలవాటుగా మారిపోయిందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కాఫీ లేదా టీ ఏదైనా సరే.. ఎక్కువ తాగితే అనర్థాలే ఎదురవుతాయి. తాగినప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది గానీ అలవాటు వ్యసనంగా మారి అదుపు లేకుండా పోతే ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. కానీ చలికాలంలో కాఫీ మానడం కష్టం. బయట చల్లగా ఉన్నప్పుడు కడుపులో వేడి కాఫీ పడితే వచ్చే కిక్కే వేరు. ఆ కిక్కు రోజులో ఒక్కసారి వస్తే సరిపోతుంది. పదే పదే కిక్కు కోసం వెళ్తే ప్రమాదాలు తప్పవు. ప్రమాదల బారిన పడకుండా మనసును కంట్రోల్ చేసుకుని కాఫీ తాగకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు పని చేస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. పసుపు లేదా బాదం: కాఫీ స్థానంలో పసుపు కలిపిన పాలు, బాదం పాలు తాగడం అలవాటు చేసుకోండి.
కాఫీ మానడానికి పనికొచ్చే చిట్కాలు
బాదం పాలలో ఇలాచీ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. పసుపు, ఇలాచీల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. టీ తాగాలనుకుంటే దాల్చిన చెక్క, తులసి, లవంగాలు, అల్లం మొదలగు వాటితో తయారు చేసుకోవాలి. అలాగే చక్కెర వాడకుండా తేనే, బెల్లం, కొబ్బరి చక్కెర వాడితే బాగుంటుంది. పొద్దున్న లేవగానే కాఫీ తాగే అలవాటున్న వారు, ఆ స్థానంలో గోరు వెచ్చని నిమ్మరసం తాగడం మంచిది. దీనివల్ల జీర్ణాశయ పనితీరు మెరుగుపడుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాఫీ, టీ లు తాగడం వల్ల తాజా మూడ్ లోకి ఎలా వస్తారో అలాంటి ఫీలింగే ఆపిల్ తిన్నా కూడా వస్తుంది. ప్రయత్నించి చూడండి. అలవాటైతే ఆరోగ్యం బాగుండి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.