Page Loader
Onion Juice For Hair: జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..
జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..

Onion Juice For Hair: జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 25, 2024
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

మీ జుట్టు ఎక్కువగా రాలిపోతోందా? తరచుగా షాంపూలు, కండీషనర్స్ లో ఉండే రసాయనాలు మీ జుట్టును నిర్జీవంగా మారుస్తున్నాయా? ఈ సమస్యకు సహజ పరిష్కారం ఉల్లిపాయ రసం. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, దీని వలన జుట్టు ఆరోగ్యకరంగా పెరగడమే కాకుండా, రాలిపోవడం తగ్గిస్తుంది. చుండ్రు, ఇతర ఇన్‌ఫెక్షన్లకు ఉల్లిపాయ రసం చక్కటి మందు. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గిస్తాయి. అలాగే, ఈ రసంలోని సహజ యాసిడ్‌లు జుట్టు చివర్లను చిట్లిపోకుండా కాపాడతాయి, అందువల్ల జుట్టు సహజంగా మెరిసిపోతుంది.

వివరాలు 

ఉల్లిపాయ రసాన్ని తయారుచేసే విధానం

కొబ్బరి నూనెతో ఉల్లిపాయ రసం కలిపి తలకు పట్టించడం వలన జుట్టు తెల్లబడకుండా కాపాడుకోవచ్చు.ఇలా చేయడం వలన మీ జుట్టు మరింత బలంగా,ఆరోగ్యకరంగా ఉంటుంది. 1. కొన్నిఉల్లిపాయలను తీసుకుని,తొక్క తొలగించి,చిన్న ముక్కలుగా కట్ చేయండి. 2.ఈ ముక్కలను 10నిమిషాల పాటు నీటిలో నానబెట్టండి. 3.ఆ తరువాత ముక్కలను బ్లెండర్ లేదా జ్యూసర్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. కొంచెం నీరు వేయవచ్చు. 4.తరువాత ఒక పలుచని వడగట్టులో ఈ మిశ్రమం నుండి రసాన్ని తీసుకోండి. 5.ఈ రసాన్ని ఒక కంటెయినర్‌లో నిల్వ చేయండి మరియు ఫ్రిజ్‌లో భద్రపరచండి. ఇప్పుడు,ఈ రసాన్నికొబ్బరి నూనెలో కలిపి తలకు అప్లై చేయండి.కొన్ని వారాల పాటు రెగ్యులర్‌గా అప్లై చేస్తే,మీ జుట్టు బలంగా మారి,సమస్యలు తగ్గుతాయి.