Home Made Face Pack: వంటింట్లో దొరికే ఈ పదార్థాలతో మీ ఫేస్ తెల్లగా మార్చుకోండి
రూపాయి ఖర్చు లేకుండా మీ ఫేస్ తెల్లగా మార్చుకోవాలని అనుకుంటున్నారా. అయితే, ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో మీ చర్మం అందంగా ఉండే కొన్ని ఫేస్ ప్యాక్‌ల గురించి తెలుసుకుందాం. వీటిని ఉపయోగించడం ద్వారా మీ చర్మం తెల్లగా మారే అవకాశం ఉంది.
తేనె పెరుగు మాస్క్
అవసరమైన పదార్థాలు: 1 టీస్పూన్ తేనె 2 టీస్పూన్లు పెరుగు విధానం: తేనె, పెరుగును బాగా కలిపి, ముఖానికి అప్లై చేయండి. 15-20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగాలి. ఈ మాస్క్ చర్మాన్ని హైడ్రేట్ చేసి, మృదువుగా చేస్తుంది. అవకాడో తేనె మాస్క్ అవసరమైన పదార్థాలు: సగం అవకాడో 1 టీస్పూన్ తేనె విధానం: అవకాడోను మెత్తగా చేసి, తేనెతో కలిపి ముఖంపై అప్లై చేయండి. 20 నిమిషాల తరువాత కడగాలి. అవకాడోలోని విటమిన్ ఇ చర్మానికి పోషణ అందిస్తుందని, తేనె చర్మానికి సులభమైన వెలుగును అందిస్తుంది.
అరటిపండు తేనె మాస్క్
అవసరమైన పదార్థాలు: సగం పండిన అరటిపండు 1 టీస్పూన్ తేనె విధానం: అరటిపండును మెత్తగా చేసుకుని, తేనెను కలిపి ముఖంపై అప్లై చేయండి.20 నిమిషాల తరువాత కడగాలి. ఇది చర్మాన్ని మృదువుగా మరియు తేమను అందిస్తుంది. ఓట్స్ పెరుగు మాస్క్ అవసరమైన పదార్థాలు: 2 టీస్పూన్లు ఓట్స్ 2 టీస్పూన్లు పెరుగు విధానం: ఓట్స్‌ను గ్రైండ్ చేసి, పెరుగుతో కలిపి ముఖంపై అప్లై చేయండి.15-20 నిమిషాల తరువాత కడగాలి.ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి, తేమను అందిస్తుంది. రోజ్ వాటర్, గ్లిజరిన్ మాస్క్ అవసరమైన పదార్థాలు: 2 టీస్పూన్లు రోజ్ వాటర్ 1 టీస్పూన్ గ్లిజరిన్ విధానం:రెండింటిని కలిపి ముఖంపై అప్లై చేయండి.15-20 నిమిషాల తరువాత కడగాలి.ఇది చర్మానికి ఉపశమనం మరియు తేమను అందిస్తుంది.
శనగ పిండి,పెరుగు ఫేస్ మాస్క్
అవసరమైన పదార్థాలు: 3 టీస్పూన్లు శనగ పిండి 2 టీస్పూన్లు పెరుగు విధానం: శనగ పిండి,పెరుగును కలిపి ముఖానికి అప్లై చేసి, 30 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడగాలి. ఇది చర్మాన్ని తెల్లగా మారుస్తుంది.