Page Loader
Hug day: హగ్ డే స్పెషల్.. ప్రేమను వ్యక్తపరచడానికి కౌగిలింతకంటే మంచి మార్గం లేదు!
హగ్ డే స్పెషల్.. ప్రేమను వ్యక్తపరచడానికి కౌగిలింతకంటే మంచి మార్గం లేదు!

Hug day: హగ్ డే స్పెషల్.. ప్రేమను వ్యక్తపరచడానికి కౌగిలింతకంటే మంచి మార్గం లేదు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 12, 2025
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

బాధగానీ, సంతోషంగానీ మన భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి చాలామందికి కౌగిలింతే ముఖ్యమైన మార్గం. ఇది మంచి అలవాటేనని నిపుణులు చెబుతున్నారు. ఒకరి మనసులోని భావోద్వేగాలను సాంత్వనగా మార్చే శక్తి ఇందులో ఉంటుంది. అయితే సోషల్ మీడియా, ఇంటర్నెట్ విస్తరణతో మెసేజ్‌లు, వీడియో కాల్స్ ద్వారా మన భావాలను తెలియజేయడం ప్రాధాన్యం పొందింది. అయినా వేల మాటల కన్నా ఒక్క హగ్ ఎంతో శక్తివంతమైనదని నిపుణులు సూచిస్తున్నారు. హగ్ ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. హగ్‌కు ఉన్న అంతటి ప్రాముఖ్యతను గమనించి, ఫిబ్రవరి 12ను 'హగ్ డే' గా జరుపుకుంటారు. ఈ సందర్భంగా కౌగిలింత వల్ల కలిగే ప్రయోజనాలు, రకాలు గురించి తెలుసుకుందాం.

Details

హగ్ ఇచ్చే ప్రయోజనాలు 

మనసు ఉల్లాసంగా మారుతుంది. ఒత్తిడిని తగ్గించి, హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. - భయాలను తొలగించి, రక్షణ భావనను పెంచుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. పరస్పర నమ్మకాన్ని పెంచి, అనుబంధాన్ని బలపరుస్తుంది. హగ్ రకాలు, వాటి అర్థాలివే 1. వెనకనుంచి కౌగిలింత ఎవరో వెనకనుంచి హత్తుకున్నారంటే, వారు మీ రక్షణ గురించి చింతించే వారని అర్థం. ఎక్కువగా ప్రేమికులు, భార్యాభర్తలు ఇలాంటి హగ్ ఇస్తుంటారు. మౌనంగా తన భావాలను వ్యక్తపరచాలనుకునేవారు ఇలా హగ్ చేస్తారు.

Details

2. గట్టిగా కౌగిలించుకోవడం 

ఎవరికైనా ఎంతో ప్రేమతో, వారిని విడిచి వెళ్లడానికి ఇష్టపడకపోతే గట్టిగా హగ్ చేస్తారు. ఇది కేవలం ప్రేమికులు, భార్యాభర్తల మధ్య మాత్రమే కాదు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య కూడా కనిపిస్తుంది. 3. ఆత్మీయ కౌగిలింత చిరునవ్వుతో హగ్ చేసుకోవడం 'పొలైట్ హగ్' గా పిలుస్తారు. ఇది ఎక్కువగా స్నేహితులు, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య కనిపిస్తుంది. ఇది ఒకరిపై నమ్మకాన్ని, హుందాతనాన్ని తెలియజేస్తుంది. 4. వీపు తడుముతూ హగ్ ఒకరిని హత్తుకునే సమయంలో వీపు నిమరడం చూస్తుంటాం. ఇది వారి సంరక్షణ భావాన్ని తెలియజేస్తుంది. తల్లిదండ్రులు, మిత్రులు, బంధువులు ప్రోత్సహించే సందర్భాల్లో ఇలాంటి హగ్ ఇస్తారు.

Details

5. నడుముపై చేతులు పెట్టి హగ్ 

ప్రేమించాలా, వద్దా అనే సందిగ్ధంలో ఉన్నవారు ఇలాంటి హగ్ ఇస్తారని నిపుణులు చెబుతున్నారు. వీరు ఎక్కువగా ఆకర్షణకు లోనై ప్రేమలో పడతారు, కానీ త్వరగా విరగిపోతారని అభిప్రాయం. 6. లండన్ బ్రిడ్జ్ హగ్ శరీరాలను అడ్డుగా ఉంచి భుజాల మీద చేతులు వేసి హగ్ చేయడాన్ని లండన్ బ్రిడ్జ్ హగ్ అంటారు. ఇది స్వచ్ఛమైన స్నేహాన్ని సూచిస్తుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. 7. కళ్లలోకి చూస్తూ హగ్ ఒకరు మీ కళ్లలోకి చూసి హగ్ చేస్తే, వారికున్న ప్రేమ, గౌరవం ఎంతో ఎక్కువగా ఉందని అర్థం. ఇది భార్యభర్తలు, ప్రేమికులు ఎక్కువగా చేసే హగ్. ప్రేమను మరింత బలపరిచే హగ్‌గా ఇది గుర్తింపు పొందింది.

Details

హగ్ డే సందేశం 

ఇన్ని ప్రయోజనాలు ఉన్న కౌగిలింతకు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించడంలో అర్థం ఉంది. మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హగ్‌ను ప్రియమైన వారితో పంచుకోవడం ద్వారా ప్రేమ, అనుబంధాలను మరింత బలపరచుకోవచ్చు.