
రాత్రుళ్ళు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? చూపు కోల్పోయిన హైదరాబాద్ అమ్మాయి కథ తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
జాబ్ లేదా టైమ్ పాస్ కోసమో స్మార్ట్ ఫోన్ వాడకం మరీ పెరిగిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే జేబు దగ్గర గుండె లేదేమో అన్నట్లుగా ఫీలయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు.
పొద్దునా, రాత్రి ఎప్పుడు పడితే కళ్ళను స్మార్ట్ ఫోన్ కి అప్పజెప్పేస్తున్నారు. దానివల్ల కళ్ళకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన 30ఏళ్ల మంజు, స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల చూపు కోల్పోయింది.
సంవత్సరంన్నర పాటు సరైన చూపు లేక చాలా బాధపడింది. ఈ విషయాలను డాక్టర్ సుధీర్ కుమార్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
కంటిచూపులో సమస్యగా ఉందనీ, వస్తువులను సరిగ్గా చూడలేకపోతున్నానని, అప్పుడప్పుడు గీతలు గీతలుగా కనిపిస్తున్నాయని తన వద్దకు మంజు వచ్చిందని డాక్టర్ చెప్పారు.
ఆరోగ్యం
చీకటి రాత్రిలో రోజూ రెండు గంటల ఫోన్ వాడకం వల్ల సమస్యలు
కొన్నిసార్లు రాత్రుళ్ళు అస్సలు కనిపించకపోయేదని మంజు తెలిపిందనీ డాక్టర్ తెలిపారు. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించిన సుధీర్, ఆమె గతం గురించి తెలుసుకుని కంటిచూపు పోవడానికి కారణం కనుక్కున్నాడు.
దివ్యాంగుడైన తన బిడ్డను చూసుకోవడానికి బ్యూటీషియన్ గా జాబ్ మానేసాక, ఎక్కువ సమయం ఖాళీ దొరకడంతో తరచుగా ఫోన్ వాడటం అలవాటైంది. అలా రాత్రుళ్ళు లైట్ ఆఫ్ చేసాక రెండు మూడు గంటలు ఫోన్ వాడేదట. దానివల్లే కంటిచూపు పోయిందని డాక్టర్ తెలుసుకున్నాడు.
ఐతే ఆమెకు మందులకు బదులు, స్మార్ట్ ఫోన్ ని పూర్తిగా పక్కకు పెట్టమని డాక్టర్ సూచించడంతో నెలరోజుల పాటు ఫోన్ ముట్టలేదట. ఇప్పుడు కంటిచూపు తిరిగొచ్చిందని డాక్టర్ తెలియజేసారు.