LOADING...
Haleem Benefits: పోషకాల పవర్‌హౌస్‌ హలీం.. రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి వరం
పోషకాల పవర్‌హౌస్‌ హలీం.. రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి వరం

Haleem Benefits: పోషకాల పవర్‌హౌస్‌ హలీం.. రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి వరం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2026
05:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

రంజాన్ మాసం ప్రారంభమవడంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో హలీం సందడి మొదలైంది. చికెన్ లేదా మటన్, గోధుమలు, వివిధ రకాల మసాలాలు, డ్రై ఫ్రూట్స్‌ను ఉపయోగించి సంప్రదాయ భట్టీలపై గంటల తరబడి నెమ్మదిగా ఉడికించే ప్రత్యేక వంటకం హలీం. రంజాన్ నెలలో ఉపవాసాల అనంతరం నాన్‌వెజ్ ప్రియులు తప్పక రుచి చూసే ఆహారంగా ఇది నిలుస్తోంది. పోషక విలువలు అధికంగా ఉండటంతో ఇఫ్తార్ విందుల్లో హలీం ప్రత్యేక ఆకర్షణగా మారింది. మాంసాహారంతో పాటు, శాకాహారులకు కూడా వెజిటేరియన్ హలీం అందుబాటులో ఉండటం విశేషం. హైదరాబాద్ హలీం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. హైదరాబాద్ బిర్యానీకి ఎంత పేరు ఉందో, హలీంకు కూడా అంతే స్థాయి ఖ్యాతి ఉంది.

వివరాలు 

హలీంలో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, కాల్షియం, అలాగే విటమిన్లు A, C, E, K

మటన్ లేదా చికెన్‌తో పాటు గోధుమలు, పప్పులు, నెయ్యి, అల్లం, వెల్లుల్లి, పసుపు, అలాగే పిస్తా, బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్‌ను ఉపయోగించి హలీం తయారు చేస్తారు. గంటల పాటు సాగే ప్రత్యేక ప్రక్రియ అనంతరం తయారయ్యే హలీంను నిమ్మరసం కలిపి తింటే రుచి మరింత పెరుగుతుంది. హలీం ఒక సంపూర్ణ పోషకాహారం అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, కాల్షియం, అలాగే విటమిన్లు A, C, E, K పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాకుండా రక్తహీనతను తగ్గించి, ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. మొత్తంగా శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఆహారంగా హలీం నిలుస్తోంది.

వివరాలు 

హలీం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు

హలీం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది అత్యంత బలవర్థకమైన ఆహారం కావడంతో శరీర దారుఢ్యాన్ని పెంచుతుంది. రక్తపోటు సమస్య ఉన్నవారిలో బీపీని నియంత్రించడంలో తోడ్పడుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్‌లా పనిచేస్తుంది. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌ల వల్ల వచ్చే అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, న్యుమోనియా వంటి అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పించడంలో ఉపయోగపడుతుంది. కోవిడ్, మంకీపాక్స్, జికా, నిఫా, చికెన్‌పాక్స్, డెంగ్యూ, చికెన్‌గునియా వంటి వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రభావాన్ని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

Advertisement

వివరాలు 

పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు హలీం సహాయపడుతుంది

హలీం తినడం వల్ల రాత్రిపూట గాఢ నిద్ర పడుతుంది. జీర్ణరసాల ఉత్పత్తి పెరిగి జీర్ణక్రియ మెరుగవుతుంది. అజీర్తి, గ్యాస్ సమస్యలను తగ్గించడంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. నెయ్యి, మాంసం ఉన్నప్పటికీ సరైన మోతాదులో తీసుకుంటే బరువు పెరగకుండా నియంత్రించడంలో, కొంతమేర బరువు తగ్గడంలో కూడా తోడ్పడుతుంది. క్రీడాకారులు, బౌన్సర్లు, పోలీసులు, మిలటరీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు వంటి వారికి అవసరమైన కండబలం, శారీరక శక్తిని హలీం అందిస్తుంది. పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు దోహదపడుతూ ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది. వృద్ధాప్యంలో కాల్షియం, విటమిన్ డీ లోపం వల్ల వచ్చే ఎముకల పెళుసుదనాన్ని నివారించి, ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము, మెడ, కండరాలు, పిక్కల నొప్పులను తగ్గించడంలో ఇది ఉపకరిస్తుంది.

Advertisement

వివరాలు 

చర్మ సౌందర్యాన్ని పెంచే హలీం

హలీం చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా ఉంచి మొటిమలు, మచ్చలు, పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర వంటి చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. వేసవిలో వచ్చే చెమట పొక్కుల సమస్యను కూడా తగ్గిస్తుంది. అలాగే శరీర స్టామినాను పెంచి లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా హలీం ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన హలీం ఒక సంపూర్ణ ఆహారంగా గుర్తింపు పొందింది. రంజాన్ నెలకే పరిమితం కాకుండా ఇప్పుడు సంవత్సరమంతా కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో అందుబాటులో ఉంది. అదేవిధంగా ఇంట్లో కూడా సులభంగా తయారు చేసుకునే అవకాశం ఉంది.

Advertisement