LOADING...
Motivation: ఈ లక్షణాలు కనిపిస్తే సందేహం అక్కర్లేదు.. వారి ప్రేమ అసలైనదే చెప్పొచ్చు!
ఈ లక్షణాలు కనిపిస్తే సందేహం అక్కర్లేదు.. వారి ప్రేమ అసలైనదే చెప్పొచ్చు!

Motivation: ఈ లక్షణాలు కనిపిస్తే సందేహం అక్కర్లేదు.. వారి ప్రేమ అసలైనదే చెప్పొచ్చు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2025
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాణక్యుడు చెప్పినట్లు, నిజమైన ప్రేమ మాటల్లో కాదు, ప్రవర్తనలోనే బయటపడుతుంది. మనపై చూపే శ్రద్ధ, సహాయం, ఆనందం, బాధలో తోడుగా నిలవడమే నిజమైన ప్రేమకు లక్షణాలు. ఆచార్య చాణక్యుడు మనుషుల స్వభావం, సంబంధాలు, ప్రేమ గురించి చెప్పిన సూత్రాలు నేటికీ ఎంతగానో వర్తిస్తాయి. చాలామందికి ప్రేమ నిజమా?లేక నటననా? అనే సందేహాలు రావడం సహజమే. చాణక్య నీతిలో ప్రేమించే వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో చాలా స్పష్టంగా చెప్పబడింది. నిజంగా మనను ఇష్టపడే వ్యక్తి మాటల్లో మాత్రమే ప్రేమ చూపించడు. చిన్న చిన్న చేష్టల్లోనే ఆ అనురాగం ప్రతిఫలిస్తుంది. మనం పక్కన లేని సమయంలో కూడా మన గురించి ఆలోచిస్తారు. మన నవ్వు వారికి సంతోషం అవుతుంది; మన బాధ వారికి బాధగా అనిపిస్తుంది.

Details

మనల్ని గమనిస్తూనే ఉంటారు

అలాంటి ప్రేమ నటించడం కాదు హృదయం నుంచి వచ్చే భావన. చాణక్యుడి మాటల్లో, నిజమైన ఇష్టం ఉన్నవారు ముందుగా మనల్ని గమనించడం ప్రారంభిస్తారు. ఎక్కడ ఉన్నా మనపై కళ్లుండేలా చూసుకుంటారు. మనపై చూపు పడిన ప్రతిసారీ వెంటనే చూపు తిప్పుకుని మళ్లీ మన వైపు చూడడం, ఇవన్నీ వారి మనసులో మన స్థానం ఎంత ప్రత్యేకమో చెబుతాయి. మన గురించి తెలుసుకోవాలనుకునే ఆసక్తి కూడా నిజమైన ప్రేమ లక్షణమే. మన ఇష్టాలు, మనకు ఏమి ఇబ్బంది, ఏమి నచ్చదు. ఈ ప్రతి చిన్న విషయాన్నీ అర్థం చేసుకోవడానికి వారు ప్రయత్నిస్తారు. మనతో మాట్లాడేటప్పుడు వారి ముఖంలో సహజమైన నవ్వు, మాటల్లో మృదుత్వం స్పష్టంగా కనిపిస్తుంది.

Details

తన

మనం చెప్పిన విషయాలను వారు ఎప్పుడూ మరచిపోరు; తరువాత సందర్భాల్లో వాటిని గుర్తు చేసి మాట్లాడతారు. మనపై ప్రత్యేక శ్రద్ధ చూపడం కూడా చాణక్యుడు పేర్కొన్న ప్రేమ సంకేతాల్లో ఒకటి. చిన్న పని అయినా సహాయం చేసేందుకు సిద్ధమవుతారు. "నీ కోసం ఏదైనా చేయగలను" అనే భావన వారిలో సహజంగా ఉంటుంది. మనం బాధలో లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు, ముందుగా మన దగ్గరకు వచ్చి "ఏమైంది?" అని నిజాయతీగా అడగడం ఇది నిజమైన ప్రేమే. మన సమస్యను తమ సమస్యలా భావిస్తారు.

Advertisement

Details

కొద్దిగా అసూయ కూడా ప్రేమలో భాగమే

మనము ఇతరులతో ఎక్కువగా నవ్వుతూ మాట్లాడితే వారికి లోపల కలిగే స్వల్ప అసహనం. అది కోపం కాదు, మనపై ఉన్న పచ్చని ప్రేమ వల్ల వచ్చే భావన. మనం ఎవరితో ఉంటాం, ఎక్కడికెళ్తాం అన్న దానిపై చూపే శ్రద్ధ, ఆసక్తి ఇవి నిజంగా ఇష్టపడే వారిలోనే కనిపిస్తాయి. ముఖ్యంగా నిజంగా ప్రేమించే వ్యక్తి మనల్ని ఎప్పుడూ తగ్గించడు, బాధపెట్టడు. మన ఎదుగుదల చూసి గర్వపడతాడు.మన విజయం వారికి ఆనందమే. మనతో ఉన్నప్పుడు తమలోని మంచితనాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తారు. చాణక్యుడి మాటల్లో చెప్పాలంటే నిజమైన ప్రేమ మాటల్లో కాదు, ప్రవర్తనలో తెలుస్తుంది. మీ జీవితంలో ఎవరో ఈలక్షణాలు చూపుతున్నారంటే.. వారు మీ కోసం నిజంగా హృదయపూర్వకంగా ప్రేమించే వ్యక్తి అని అర్థం.

Advertisement