Gas Trouble: గ్యాస్ రాకుండా ఉండేందుకు ఈ ఆహారాలను తినడం మానేయండి..
ఈ వార్తాకథనం ఏంటి
ఒకప్పుడు కేవలం జీర్ణ సమస్య ఉన్నవారికే గ్యాస్ సమస్య ఉండేది.కానీ ఇప్పుడు ఇది శిశువులకి కూడా పెద్ద సమస్యగా మారింది.
ప్రస్తుతం చాలా మంది గ్యాస్ ట్రబుల్‌తో బాధపడుతున్నారు, ఇది ఒక కామన్ సమస్యగా మారింది.
గ్యాస్ సమస్యకు అనేక కారణాలు ఉన్నా, ఆహారం ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు.
మన శరీరానికి సరిపడని ఆహారాలు తినడం వల్ల అవి సరిగ్గా జీర్ణం కాకుండా గ్యాస్ ఏర్పడుతుంది.
అలాగే, వేళకు భోజనం చేయకపోవడం, అసమతుల్య ఆహారం తీసుకోవడం, అధిక ఆహారం తీసుకోవడం, మద్యాన్ని లేదా శీతల పానీయాలను అధికంగా సేవించడం, పొగతాగడం కూడా గ్యాస్ సమస్యకు కారణమవుతాయి.
శారీరక శ్రమ లేకపోయినా కూడా గ్యాస్ ఏర్పడవచ్చు.
వివరాలు
పాలలో లాక్టోస్ అనే ప్రోటీన్
కొంతమంది ప్రత్యేక ఆహార పదార్థాల వల్ల గ్యాస్ సమస్యను ఎదుర్కొంటారు.
ఉదాహరణకు, బీన్స్, పుట్టగొడుగులు, యాపిల్స్, పప్పు ధాన్యాలు, చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, నూనె పదార్థాలు కొందరికి సహజంగానే గ్యాస్ సమస్య ఏర్పడుతాయి.
ఈ ఆహారాలను తగ్గించడం లేదా పూర్తిగా మానడం మంచిది. పాలులేదా పాల ఉత్పత్తులు కూడా కొందరికీ పడవు.
వీటిని తీసుకున్నప్పుడు గ్యాస్ ఏర్పడుతుంది. పాలలో లాక్టోస్ అనే ప్రోటీన్ ఉంటుంది, ఇది సరిగ్గా జీర్ణం కాకపోతే పొట్ట ఉబ్బడం, తద్వారా గ్యాస్ ఏర్పడుతుంది.
జున్ను, కోడిగుడ్లు వంటి ఆహారాలు కూడా కొందరికీ సరిగ్గా జీర్ణం కావు. ఈ ఆహారాలను తినడంతో 60 నుండి 90 నిమిషాలలో గ్యాస్ ఏర్పడితే, అవి మానేయడం ఉత్తమం.
వివరాలు
పీచు అధికంగా ఉండే ఆహారాలు కూడా..
ఆలుగడ్డలు, మొక్కజొన్న, గోధుమ పిండి వంటి పిండి పదార్థాలు కొందరికి జీర్ణం కావడం లేదు. వీటిని తీసుకున్నప్పుడు కూడా గ్యాస్ ఏర్పడుతుంది.
అలాగే, పీచు అధికంగా ఉండే ఆహారాలు కూడా కొందరికి గ్యాస్ సమస్యను కలిగిస్తాయి.
బ్రౌన్ రైస్, బీన్స్, ఓట్స్, గోధుమలు, పలు రకాల పండ్లు, కూరగాయలు పీచు అధికంగా ఉండి, అవి సరిగ్గా జీర్ణం కాక గ్యాస్ సమస్య వస్తుంది. వీటిని తీసుకోవడం మానేస్తే ఈ సమస్య తగ్గుతుంది.
కొవ్వు పదార్థాలు చాలా మందికి సరిగ్గా జీర్ణం కావు. తరచూ కొవ్వు పదార్థాలు తీసుకుంటే కూడా గ్యాస్ వస్తుంది. దీనిని నివారించడానికి, కొవ్వు పదార్థాలను తగ్గించడం అవసరం.
వివరాలు
బేకరీలలో లభించే పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్..
ప్రాసెస్ చేయబడిన పాలు, ఇతర ఆహారాలు కూడా కొందరికి సరిగ్గా జీర్ణం కావు, ఇవి కూడా గ్యాస్ సమస్యను కలిగిస్తాయి.
బేకరీలలో లభించే పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, నూనె పదార్థాలు కూడా జీర్ణం కావడం లేదని తెలుసుకోవాలి.
అటువంటి ఆహారాలు తప్పించడం గ్యాస్ సమస్యను నివారించడంలో సహాయపడుతుంది. ఇలా ఆహారాలను జాగ్రత్తగా ఎంచుకుంటే గ్యాస్ సమస్య నుండి బయటపడవచ్చు.