
Motivational: ఈ ఇద్దరిని గౌరవించకపోతే జీవితంలో శాంతి దూరమే!
ఈ వార్తాకథనం ఏంటి
చాణక్యుడు తన 'చాణక్య నీతి' గ్రంథంలో జీవితానికి సంబంధించి అనేక అమూల్యమైన మార్గదర్శకాలను అందించారు. ఆయనే కాకుండా చెప్పిన కొన్ని నీతులు నేటికీ సమాజంలో ప్రభావవంతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా, జీవితంలో ఇద్దరిని ఎప్పుడూ బాధపెట్టకూడదని, వారిని గౌరవంగా చూసుకోవాలని చాణక్యుడు స్పష్టంగా హెచ్చరిస్తారు. ఇప్పుడు ఆయనే పేర్కొన్న ఆ ఇద్దరు ఎవరో తెలుసుకుందాం.
Details
తల్లిదండ్రులపై చాణక్యుని గౌరవ దృక్పథం
చాణక్యుని అభిప్రాయం ప్రకారం, తల్లిదండ్రులను గౌరవించని వ్యక్తి జీవితంలో నిజమైన సుఖాన్ని అనుభవించలేడు. మన కోసం ఎన్నో త్యాగాలు చేసే తల్లిదండ్రుల పట్ల మనం గౌరవభావంతో ఉండాల్సిన బాధ్యత మనపై ఉన్నదని ఆయన పేర్కొంటారు. తల్లిదండ్రులకు సేవ చేయడం వల్ల పుణ్యం లభించదని, వారు ఇచ్చే ఆశీర్వాదంతో మన జీవితం అభివృద్ధి పథంలో దూసుకెళ్లగలదని చాణక్యుని నమ్మకం.
Details
గౌరవంతో, ప్రేమతో మాటలాడండి
తల్లిదండ్రులతో మమతగా, గౌరవంగా మాట్లాడటం ఎంత ముఖ్యమో చాణక్యుడు ప్రత్యేకంగా చెప్పాడు. వారిని చిన్నచూపు చూడకూడదని, ఆవేశంలో కఠినంగా మాట్లాడకూడదని ఆయన హితవు పలికారు. మన మాటలు వారికి బాధ కలిగించకుండా జాగ్రత్తగా మాట్లాడాలని, ఒక్కసారి మాట్లాడిన మాట తిరిగి తీసుకోలేమని, కాబట్టి అన్నిటికీ ముందు ఆలోచన అవసరమని సూచించారు. మొత్తానికి, తల్లిదండ్రుల పట్ల గౌరవం, ప్రేమను చూపడం వల్ల వారి దీవెనలు మన జీవితం సంతోషకరంగా మలుచుతాయని చాణక్యుని విశ్వాసం. వారు చెప్పే మాటలకు విలువనిస్తూ జీవితం నడిపితే, సదా మంచి ఫలితాలు ఎదురవుతాయని ఆయన సారాంశం.