#SankranthiSpecial: సంక్రాంతి రోజున ఇవి దానం చేస్తే.. శనిదేవుడి అనుగ్రహంతో వంద రెట్ల పుణ్యం!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతేడాది మాఘ మాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తూ మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సూర్య భగవానుడి కుమారుడైన శనిదేవుడికి మకర రాశి అధిపత్యం ఉండటంతో ఈ పండుగకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భిన్న పేర్లతో ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానాలు చేసి, పలు వస్తువులను దానం చేయడం అనాది సంప్రదాయంగా కొనసాగుతోంది. సూర్య భగవానుడితో ముడిపడిన పండుగ కావడంతో మకర సంక్రాంతి నాడు ఆదిత్యునికి ప్రత్యేక పూజలు చేస్తారు.
Details
ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి
ఈ రోజున సూర్యుని ఆరాధిస్తే కోరికలు నెరవేరుతాయని, ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. అలాగే న్యాయ దేవుడైన శనిదేవుని కృప పొందాలనుకునే వారు కొన్ని ముఖ్యమైన దానాలు చేయాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. సంక్రాంతి రోజున ఈ వస్తువులను దానం చేస్తే వంద రెట్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ పండుగ రోజు చేయవలసిన ముఖ్యమైన దానాలు ఏమిటో తెలుసుకుందాం.
Details
నల్ల నువ్వులు
మకర సంక్రాంతి నాడు స్నానం, ధ్యానం, పూజ, జపం, తపస్సు చేసిన అనంతరం నల్ల నువ్వులను దానం చేయాలి. ఈ రోజున నల్ల నువ్వులు దానం చేయడం వల్ల జాతకంలో శనిదేవుడు బలపడతాడని, ఆయన అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. దేవాలయాల్లో కూడా నల్ల నువ్వులను సమర్పించవచ్చు. నెయ్యి సంక్రాంతి రోజు పూజలు పూర్తయ్యాక నెయ్యిని దానం చేయడం శుభకరంగా భావిస్తారు. నెయ్యి కలిపిన కిచిడీని లేదా మినపప్పుతో చేసిన కిచిడీని తయారు చేసి పేదలకు పంచితే జీవితం ఆనందం, శాంతితో నిండుతుందని విశ్వాసం. దీని ద్వారా శనిదేవుని ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు.
Details
నల్ల దుప్పట్లు
మకర సంక్రాంతి నాడు పూజలు, జపాలు, ధ్యానం అనంతరం పేదలకు నల్ల దుప్పట్లు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల శనిదేవుడి కృపతో కెరీర్, వ్యాపారాల్లో ఆశించిన విజయాలు సాధిస్తారని నమ్మకం. అదనంగా బెల్లం దానం చేసినా మంచి ఫలితాలు వస్తాయని పండితులు సూచిస్తున్నారు. ఈ విధంగా మకర సంక్రాంతి రోజున సూర్యుడు, శనిదేవుడిని స్మరిస్తూ దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం పెరిగి, జీవితం సుఖశాంతులతో నిండుతుందని విశ్వసిస్తున్నారు.