Holy Basil Leaf: తులసి ఆకులతో వంటకాలు.. ట్రై చేశారా?
ఈ వార్తాకథనం ఏంటి
తులసి అనేది ఒక ఆకుకూర అని చాలా మందికి తెలియకపోవచ్చు. చాలా మంది తులసిని ఇష్టపడతారు. పూజకు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఔషధాల తయారీలో కూడా దీనిని వాడుతారు. కానీ దీనిని వంటకాలలో ఉపయోగిస్తారని చాలా మందికి తెలికపోవచ్చు. సాధారణంగా సువాసన వచ్చే ఆకులను సలాడ్‌ల నుండి సాస్‌ల వరకు దేనిలోనైనా వాడొచ్చు. ఇది కొత్త రుచిని అందిస్తుంది. అలాగే తులసి ఆకుతో మనం చేసుకునే ఐదు వంటకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తాగడానికి బాగుంటుంది
తులసితో అదిరిపోయే నిమ్మరసం
తులసి ఆకులతో చేసిన నిమ్మరసం అద్భుతమైన రుచిని అందిస్తుంది. దీన్ని చేయడానికి తాజా తులసి ఆకులను తీసుకోవాలి. నిమ్మరసం, పంచదారను కలిపి కొద్దిగా మెత్తగా చేయాలి. ఆ తర్వాత నీళ్లు, ఐస్‌ముక్కలు వేయాలి. అది మరింత చల్లదనాన్ని ఇస్తుంది. నిమ్మకాయ, తులసి కలిసిన ఈ మిశ్రమం మరింత రుచిగా ఉంటుంది. శరీర వేడి నుంచి ఇది ఉపశమనం కల్పిస్తుంది.
రుచికరమైన వంటకం
తులసితో నోరూరించే పాస్తా సలాడ్
తులసితో పెస్టో పాస్తా సలాడ్ చేసుకోవచ్చు. పెస్టో చేయడానికి తాజా తులసి ఆకులు, పైన్‌నట్స్, వెల్లుల్లి, పర్మేసన్ చీజ్, ఆలివ్ ఆయిల్ తీసుకుని వాటిని కలపాలి. వాటిని ఉడికించిన తర్వాత పాస్తా, చెర్రీ టొమాటోలతో కలపాలి. ఇవి మరింత రుచిని, తీపిని అందిస్తాయి. ఈ వంటకం తినడానికి చాలా బాగుంటుంది.
తీపి వంటకం
స్ట్రాబెరీ బేసిల్ సార్బెట్ చేసుకోండిలా
స్ట్రాబెరీ బేసిల్ సార్బెట్ రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది స్ట్రాబెరీ తీపిని, తులసిలోని ఘాటును అందిస్తుంది. అందుకోసం ముందుగా తాజా స్ట్రాబెరీలను పంచదారతో కలిపి మెత్తగా చేసుకోవాలి. తర్వాత తరిగిన తులసి ఆకులు వేసి, ఐస్ క్రీమ్ మేకర్‌లో పెట్టి గడ్డకట్టేలా చేయాలి. వేసవిలో ఈ చల్లని సార్బెట్ అద్భుతంగా ఉంటుంది.
తొందరగా అయ్యే వంటకం
చిటికెలో కూరగాయల స్టర్-ఫ్రై చేసుకోండిలా
తులసిని ఉపయోగించి కూరగాయల స్టర్-ఫ్రైని క్షణాల్లో చేసుకోవచ్చు. మీకు నచ్చిన కూరగాయలు (బెల్ పెప్పర్‌లు, జుకినీ, బ్రోకలీ వంటివి) తీసుకుని ఆలివ్ ఆయిల్ లో మెత్తగా అయ్యేవరకు వేయించాలి. సోయా సాస్, తాజాగా తరిగిన తులసి ఆకులు వేసి మంచి వాసన వచ్చే వరకు కలపాలి. ఆ తర్వాత మీరు మంచి రుచిని ఆస్వాదించవచ్చు.
ఆకలి పుట్టించే చిరుతిండి
అద్భుతమైన రుచితో.. టొమాటో తులసి బ్రస్కెటా
టొమాటో బేసిల్ బ్రస్కెటా అనేది మీకు ఆకలి ఎక్కువ కలిగేలా చేస్తుంది. తరిగిన టొమాటోలు, చిన్న ముక్కలుగా చేసిన వెల్లుల్లి, ఆలివ్ ఆయిల్, బాల్సమిక్ వెనిగర్, ఉప్పు, మిరియాలు, సన్నగా తరిగిన తాజా బేసిల్ ఆకులు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కాల్చిన బ్రెడ్ ముక్కలపై వేయాలి. ఇలా చేసుకుని తింటే అద్భుతమైన రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా మీరు పొందొచ్చు.