Winter Season: చలికాలంలో ఈ తప్పులు చేస్తే.. పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
చలికాలం వచ్చిందంటే వాతావరణం చల్లబడటంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతుంటాయి. చాలామంది తెలియక చేసే చిన్న చిన్న తప్పిదాలే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సంబంధిత ఇబ్బందులకు కారణమవుతాయి. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చలికాలాన్ని ఆరోగ్యంగా, హాయిగా గడపవచ్చు. మీ జీవనశైలి, ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపించే ముఖ్యమైన సూచనలు ఇవి.
Details
1. నిద్ర లేచిన వెంటనే చలిలోకి వెళ్లొద్దు
ఉదయం నిద్రలేవగానే వేడి పడక నుంచి నేరుగా బయట చలి వాతావరణంలోకి వెళ్లడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గి గుండెపై ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిసేపు గదిలోనే ఉండి, స్వెట్టర్లు లేదా వెచ్చని దుస్తులు వేసుకున్న తర్వాత బయటకు వెళ్లాలి. 2. డయాబెటీస్ ఉన్నవారు మరింత జాగ్రత్త శీతాకాలంలో వెలుతురు తక్కువగా ఉండటంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. దీని ప్రభావంతో డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే వింటర్ సీజన్‌లో వ్యాయామం, యోగా వంటి కార్యకలాపాలు చేస్తే షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Details
3. కాఫీ, టీలు అతిగా తాగొద్దు
చలికాలంలో వేడి వేడి కాఫీ, టీలు ఎక్కువగా తాగాలని అనిపిస్తుంది. అయితే వీటిలోని కెఫీన్ కారణంగా శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. రోజుకు రెండు లేదా మూడు కప్పులకే పరిమితం కావడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. 4. చర్మ సంరక్షణ తప్పనిసరి చలికాలంలో చర్మం పొడిబారినప్పుడే క్రీములు రాయడం చాలామందిలో కనిపిస్తుంది. కానీ చర్మం తేమగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పెదవులు ఆరినప్పుడు పదే పదే నాలుకతో తడపడం ప్రమాదకరం. దీని వల్ల పెదవులు మరింత పగిలే అవకాశం ఉంటుంది. లిప్ బామ్ లేదా వ్యాసిలిన్ వాడటం ఉత్తమం.
Details
5. గదుల్లో గాలి ప్రవాహం ఉండాలి
చలికాలంలో ఇల్లు వెచ్చగా ఉండాలని తలుపులు, కిటికీలు పూర్తిగా మూసివేయడం లేదా బొగ్గు, రూమ్ హీటర్లను ఎక్కువగా వాడటం ప్రమాదకరం. ఇలా చేస్తే గదిలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయి పెరిగి ఊపిరి ఆడకపోవడం, ప్రాణాపాయం కూడా సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 6. సమయానికి భోజనం చేయాలి శీతాకాలంలో ఆలస్యంగా భోజనం చేస్తే జీర్ణక్రియ మందగించి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అందుకే సాధ్యమైనంత త్వరగా భోజనం చేయడం, పడుకునే ముందు కనీసం రెండు గంటల ముందు భోజనం పూర్తి చేయడం మంచిది.
Details
7. చల్లని ఆహారాలకు దూరంగా ఉండాలి
వింటర్ సీజన్‌లో ఐస్‌క్రీమ్స్, చల్లని పానీయాలు తీసుకోవడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు, సొర్ థ్రోట్, టాన్సిల్స్ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే సాధ్యమైనంతవరకు వేడి పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 8. బయట ఆహారాన్ని తగ్గించాలి శీతాకాలంలో బయట ఫుడ్‌ను ఎక్కువగా మానేయడం ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా ఫ్రైస్, జంక్ ఫుడ్ వంటి వేపుడు పదార్థాలు ఎక్కువగా తింటే బరువు పెరగడం, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు, బద్దకం కూడా పెరుగుతుంది. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే చలికాలాన్ని అనారోగ్యాల బెడద లేకుండా ఆరోగ్యంగా గడపవచ్చు.