LOADING...
karthika Masam: కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే పాపాలు దూరమై, పుణ్యం చేకూరుతుంది!
కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే పాపాలు దూరమై, పుణ్యం చేకూరుతుంది!

karthika Masam: కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే పాపాలు దూరమై, పుణ్యం చేకూరుతుంది!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 22, 2025
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిందూ పంచాంగంలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది. ఈ మాసం పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనదిగా పరిగణిస్తారు. ప్రతి రోజూ పర్వదినంలా భావించే ఈ మాసంలో భక్తులు చేసే పూజలు, దానధర్మాలు, దీపారాధనలు జన్మజన్మల పాపాలను కూడా తొలగిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో భగవంతుని అనుగ్రహం పొందాలంటే తప్పక చేయవలసిన నాలుగు ముఖ్యమైన ఆచారాలున్నాయి. ఇందులో దీపారాధన, కార్తీక స్నానం, ఉపవాసం, తులసీ కల్యాణం ఉన్నాయి.

Details

 దీపారాధన

కార్తీక మాసంలో ప్రతి భక్తుడి ఇంట్లో పూజగదిలో దీపం వెలుగుతూ ఉండడం శుభప్రదం. ఉదయం, సాయంత్రం ఆవు నెయ్యితో దీపారాధన చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. ఉసిరికాయలతో చేసిన దీపాలు వెలిగించడం కూడా పుణ్యప్రదం. లక్ష్మీ దేవికి ఉసిరి కాయ ఎంతో ఇష్టమైనది కాబట్టి ఈ మాసంలో ఉసిరి దానం చేయడం లేదా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం పుణ్యఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు పేర్కొంటాయి.

Details

 సముద్ర లేదా నదీ స్నానం

కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయడం అత్యంత పవిత్రమైన ఆచారం. దానిని కార్తీక స్నానం అంటారు. నది లేదా సముద్రంలో స్నానం చేసిన తర్వాత సమీప దేవాలయంలో దీపం వెలిగించి దేవుని దర్శించాలి. నదులకు వెళ్లలేని వారు ఇంట్లో స్నానం చేసి, దైవాన్ని పూజించి, తులసి కోట వద్ద దీపాలు వెలిగించాలి. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ఈ స్నానాన్ని ఆచరించడం శ్రేయస్కరం. ఉపవాసం కార్తీక మాసంలో ఉపవాసం చేయడం పరమార్థమైన ఆచారం. ఇష్టదైవాన్ని ధ్యానిస్తూ పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయడాన్ని నక్తమ్ అంటారు. ఇది ఆధ్యాత్మికంగా దేవుని అనుగ్రహాన్ని కలిగిస్తే, శాస్త్రీయంగా ఆరోగ్యానికీ మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Details

 తులసీ కల్యాణం

క్షీరాబ్ది ద్వాదశి రోజున శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవితో కలిసి తులసి దాత్రివనంలో దర్శనమిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కృతయుగంలో క్షీరసాగర మథనం జరిగిన రోజును క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. ఈ రోజున తులసీ కల్యాణం జరపడం అత్యంత పుణ్యకరమైనదిగా పరిగణిస్తారు.

Details

కార్తీక మాసంలోని ముఖ్య పండుగలు, పర్వదినాలు

అక్టోబర్ 22:గోవర్ధన్ పూజ, అన్నకూట్ (ఉత్తర భారతంలో ప్రత్యేకంగా జరుపుకుంటారు) అక్టోబర్ 23:భాయ్ దూజ్, యమ ద్వితీయ అక్టోబర్ 25:నాగుల చవితి అక్టోబర్ 26:నాగ పంచమి అక్టోబర్ 27:కార్తీక సోమవారం, స్కంద షష్టి, ఛత్ పూజ అక్టోబర్ 29:బుధ అష్టమి వ్రతం అక్టోబర్ 30:గోపాష్టమి అక్టోబర్ 31:అక్షయ నవమి నవంబర్ 1: ఏకాదశి, కంస వధ నవంబర్ 2:యోగేశ్వర ద్వాదశి నవంబర్ 3:కార్తీక సోమ ప్రదోష వ్రతం నవంబర్ 4: మణికర్ణిక స్నానం నవంబర్ 5: కార్తీక పౌర్ణిమ, గురునానక్ జయంతి నవంబర్ 8: సంకష్టహర చతుర్థి నవంబర్ 10: కార్తీక సోమవారం నవంబర్ 17: కార్తీక సోమవారం నవంబర్ 18: మాస శివరాత్రి నవంబర్ 20: కార్తీక మాసం చివరి రోజు