
New Year 2025: కొత్త సంవత్సరం మొదటి రోజున వీటిని చూస్తే.. ఏడాదంతా ఆనందమే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరాన్ని సానుకూల శక్తితో ప్రారంభించాలని, అది సుఖభరితంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటారు.
కొత్త సంవత్సరం ముందుకొస్తున్న కొద్దీ, చాలామంది తమ భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందిస్తూ, రాశి ఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు.
అయితే మీరు కొత్త సంవత్సరాన్ని సంతోషంగా, శుభంగా ప్రారంభించాలని అనుకుంటే కొన్ని సంకేతాలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది.
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వీటిని చూడాల్సిందే
1) తెల్లని పూలు లేదా ఏనుగు
కొత్త సంవత్సరం మొదటి రోజు ఉదయం తెల్లని పూలు లేదా ఏనుగులను చూస్తే, అవి మంచి సంకేతాలు. ఇవి లక్ష్మీదేవి అనుగ్రహం, ధన ప్రాప్తి చిహ్నాలు.
ఈ సంకేతాలు మీ ఇంటికి అదృష్టం తెస్తాయని భావించవచ్చు.
Details
2. పక్షి గూడు
కొత్త సంవత్సరం మొదటి రోజున పక్షి గూడును చూడటం కూడా మంచి శక్తిని సూచిస్తుంది.
ఇది లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉన్నట్టు భావించవచ్చు. ఈ సంకేతం సానుకూల శక్తులను మీ జీవితంలోకి తీసుకువస్తుందని భావించాలి.
3. శంఖం లేదా గంట శబ్దం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొత్త సంవత్సరంలో శంఖం లేదా గంట శబ్దం వింటే, అది మంచి శక్తి సంకేతం. ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, సుఖాన్ని సూచిస్తుంది.
4. కలలో బంగారం, వెండి, ధనం చూడటం
కొత్త సంవత్సరం మొదట రోజు మీకు కలలో బంగారం, వెండి లేదా ధనం కనిపిస్తే, ఇది చాలా శుభంగా భావించవచ్చు.
దీనివల్ల ధన సంపద పెరిగిపోతుందని, ఆర్థికంగా మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది.