Page Loader
Success Secrets: ఉదయం ఇలా మొదలుపెడితే.. రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు! 
ఉదయం ఇలా మొదలుపెడితే.. రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు!

Success Secrets: ఉదయం ఇలా మొదలుపెడితే.. రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 10, 2025
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

మన రోజు ఎలా ప్రారంభమవుతుందో, అది మిగతా రోజంతా మన శారీరక, మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. ఉదయాన్నే శరీరం చురుకుగా, మనసు ప్రశాంతంగా ఉండేలా కొన్ని మంచీ అలవాట్లు కొనసాగిస్తే, పనుల్లో ఉత్సాహంగా, ఫోకస్‌తో ముందుకు సాగవచ్చు. ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Details

సరిపడిన నిద్ర అవసరం

రాత్రివేళ మంచి నిద్ర లభిస్తే, ఉదయం తేలిగ్గా లేచి రోజు ప్రారంభించగలుగుతాం. నిద్ర సరిగా లేకపోతే ఉదయం అలసట, రోజంతా బద్దకంగా ఉండే అవకాశం ఉంటుంది. కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం. శరీరానికి అవసరమైన శక్తిని అందించాలంటే ఈ నిద్ర కీలకం. వేడి నీటి స్నానం ఉదయాన్నే వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం పూర్తిగా మేలుకుంటుంది. మత్తు తొలగిపోతుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. చలికాలంలో ఇది శరీరానికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.

Details

ధ్యానం లేదా శ్వాస వ్యాయామం 

ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయడం లేదా లోతైన శ్వాస వ్యాయామం చేయడం వల్ల మనసు స్థిరపడుతుంది. ఉదయపు తొందరలో వచ్చే ఒత్తిడిని తగ్గించడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. దృష్టి కేంద్రీకరించడానికి సాయపడుతుంది హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి సమతుల్యమైన, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ చాలా అవసరం. ప్రొటీన్లు, పీచుపదార్థాలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ఉదయం భోజనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు. అది రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది.

Details

పసుపు పాలు లేదా తక్కువ మోతాదులో కాఫీ 

ఉదయాన్నే కొద్దిగా పసుపు కలిపిన పాలు లేదా స్వల్పంగా కాఫీ తీసుకుంటే శరీరానికి శక్తి పెరుగుతుంది. అలసట తగ్గి ఉత్సాహం పెరుగుతుంది. అయితే మోతాదులో ఉండేలా చూసుకోవాలి. మార్నింగ్ వాక్ కొద్దిసేపు బయట నడవడం ద్వారా శరీరం చురుగ్గా మారుతుంది. తాజా గాలి పీల్చడం వల్ల మెదడు ప్రోత్సాహాన్ని పొందుతుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్పష్టత కూడా మెరుగవుతుంది. సూర్యకాంతి కీలకం ఉదయం సూర్యకాంతి శరీరంపై పడటం ద్వారా నిద్రను నివారించే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇది శరీరాన్ని మేల్కొల్పుతుంది, మనసు చురుగ్గా ఉంటుంది. అంతేకాకుండా సూర్యకాంతి మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.